టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.ఈయన హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా విశ్వక్ గామి( Gaami ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.విద్యాధర్ కగిట దర్శకత్వంలో రూపొందింది.
చాందినీ చౌదరీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు.మరి నేడు మార్చి 8వ తేదీ విడుదలైన ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ద్వారా విశ్వక్ ఎలాంటి సక్సెస్ అందుకున్నారనే విషయానికి వస్తే.
కథ:
శంకర్(విశ్వక్ సేన్) ఒక అఘోర.తెలియని ఒక సమస్యతో బాధపడుతుంటాడు.
అతన్ని ఏ మనిషి టచ్ చేసినా బాడీలో మార్పులు వస్తుంటాయి.అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు.
ఇలా తన వల్ల ఎంతోమంది బాధపడుతూ ఉండడంతో ఆ ఆశ్రమం నుంచి తనని బయటకు పంపించేస్తారు.ఇలా బయటకు పంపించడంతో తనని చేరదీసిన తన గురువు వద్దకు పయణమవుతారు ఇలా కాశీకి వెళ్లగా ఆ గురువుగారు చనిపోయారనే విషయాన్ని తెలుసుకొని ఆ సమస్యను తన శిష్యుడికి చెబుతారు.
శంకర్ సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని త్రివేణి పర్వతంలో 36ఏళ్లకి ప్రకాశించే మాలిపత్రి చెట్టులో ఉంటుందని చెబుతాడు.వైద్ర తిథి రోజున మాత్రమే మాలిపత్రి ప్రకాశిస్తుంది.
ఆ స్థితి రోజున మాత్రమే దానిని తీసుకుంటే ఈ సమస్య తొలగిపోతుందని చెప్పగా శంకర్ మాల పత్రి చెట్టు కోసం బయలుదేరుతాడు.జాహ్నవి(చాందినీ చౌదరి) కూడా తన మెడికల్ ప్రయోగం కోసం దాన్ని పొందాలని అతనితో కలిసి వెళ్తుంది.
ఇలా హిమాలయాలకు వెళ్లినటువంటి వారు ఆ మాలి పత్రి సొంతం చేసుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.అక్కడ వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వారు ఆ మూలికను తీసుకున్నారా శంకర్ ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అన్నది ఈ సినిమా కథ.
నటీనటుల నటన:
విశ్వక్ ఎన్నో వైవిద్య భరితమైనటువంటి పాత్రలలో నటించారు.అయితే ఈ సినిమాలో ఈయన అఘోరాగా కనిపించారు.ఇక ఈ పాత్రలో విశ్వక్ ఒదిగిపోయి నటించారని చెప్పాలి.తన పాత్రకు ఈయన వందకు వంద శాతం న్యాయం చేశారు.ఇక చాందిని చౌదరి( Chandini Chowdary ) కూడా తన పాత్రకు ఎంతో న్యాయం చేశారు.ఇలా సినిమాలో ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి.మ్యూజిక్, బీజీఎం అదిరిపోయింది.సినిమాని ఎంగేజ్ చేయడంలో మేజర్ పాత్ర పోషించింది.బ్యాక్ బోన్ లా నిలుస్తుంది.మరోవైపు ఈ సినిమా విజువల్స్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రం అయినప్పటికీ ఇదివరకే ఇలాంటి తరహా సినిమా చూసాము అన్న భావన అందరిలోనూ కలుగుతుంది.ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది.ప్రతి ఎలిమెంట్‌కి సస్పెన్స్ పెట్టి సినిమాని నడిపించాడు దర్శకుడు.ఆడియెన్స్ అలా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు కానీ విఫలం అయ్యారు.ఈ సినిమాలో బలమైన కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు.అనేక అంశాలను సస్పెన్స్ తో వదలడంతో ఆడియెన్స్ లో బిగ్ కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది.
సస్పెన్స్ అంశాలు ఒకదశలో చిరాకు పెట్టించేలా ఉంటాయి.మొత్తానికి ఒక ప్రయత్నం చేయాలన్న తపనతో ఈ సినిమాని తీసుకువచ్చారు కానీ కాస్త స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
విశ్వక్ నటన, కథ,
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్, భారీ ట్విస్టులు, బోర్ కొట్టించే అంశాలు.
బాటమ్ లైన్:
ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కన్ఫ్యూషన్ కి గురవుతూనే ఉన్నారు.అంతేకాకుండా ఈ సినిమా చూస్తుంటే ఈ తరహా సినిమాలు చూసాము అనే భావన కలుగుతుంది.