తెలుగు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించినటువంటి వారిలో విష్ణుప్రియ ఒకరు.ఇలా ఈమె యాంకర్ గా వ్యవహరించినప్పటికీ ప్రస్తుతం మాత్రం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పలు కవర్ సాంగ్స్ చేయడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు.
ఇలా ఈమె వెబ్ సిరీస్ లు, బుల్లితెర కార్యక్రమాలు కంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక విష్ణు ప్రియ (Vishnu Priya) ప్రాణ స్నేహితురాలు అయినటువంటి వారిలో రీతు చౌదరి (Rithu Chowdary) కూడా ఒకరు.
పలు సీరియల్స్ లో నటిగా నటిస్తూనే రీతు చౌదరి అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.జబర్దస్త్ కార్యక్రమం( Jabardasth ) ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె కూడా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంటారు.
తరచూ వెకేషన్ లకి వెళ్లడం పార్టీలకు వెళ్లడం, పబ్ లకు వెళ్లడం చేస్తూ తమ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా విష్ణు ప్రియ రీతు చౌదరి ఇద్దరు కలిసి పార్టీకి ( Party ) వెళ్లారని తెలుస్తుంది.అక్కడ పెద్ద ఎత్తున డ్రింక్ తాగుతూ డాన్సులు చేస్తూ చిల్లవుతూ ఉన్నారు.ఇందుకు సంబంధించినటువంటి వీడియోని విష్ణుప్రియ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.ఒకే విధమైనటువంటి మెంటల్ డిజార్డర్ ఉన్నటువంటి స్నేహితులను వెతకడానికి వేల కట్టలేము అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.
దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మొత్తానికి ఇద్దరు మెంటల్ వాలేనని ఒప్పుకున్నారు అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేయగా మరి కొందరు సరిపోయారు ఇద్దరు అంటూ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా మరొక నెటిజన్ ఈ వీడియో పై ఘోరమైనటువంటి కామెంట్స్ చేశారు.కేవలం అవకాశాల కోసం మాత్రమే ఇలా అన్ని విప్పి చూపిస్తూ రచ్చ చేస్తుంటారు అంతకుమించి మరేమీ లేదు అంటూ ఈ వీడియో పై ఘోరమైనటువంటి కామెంట్స్ చేశారు.
అయితే సెలబ్రిటీలు గ్లామర్ షో ( Glamor Show ) చేస్తేనే ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తాయనే వాస్తవం అందరికీ తెలిసిందే.ఇలా అవకాశాల కోసం పెద్ద ఎత్తున సెలబ్రిటీలు గ్లామరస్ ఫోటోషూట్స్ చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక విష్ణుప్రియ రీతూ చౌదరి గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అన్నట్టు పోటీ పడుతూ మరి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తుంటారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ భారీగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పాలి.