బుల్లి తెర యాంకర్ గా, నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ( Vishnu Priya ) ఒకరు.యాంకర్ గా మొదలైన ఈమె ప్రయాణం అనంతరం సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ సందడి చేశారు.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss 8 ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న విష్ణు ప్రియ ఈ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం పలు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా సమాజంలో అమ్మాయిలు( Girls ) అబ్బాయిల( Boys ) పై ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ ఈ సమాజంలో అమ్మాయిలు, అబ్బాయిల విషయంలో ఎంతో వ్యత్యాసం చూపుతారు.మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ మమ్మల్ని అలాగే చూసేదని విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యారు.అబ్బాయిలకు ఎలాంటి కండిషన్లు ఉండవు.వారు ఎంతో స్వేచ్ఛగా బయట తిరిగి రావచ్చు కానీ అమ్మాయిల విషయంలో అలా కాదు చీకటి పడేలోపు ఇంట్లోకి రావాలి బయట తిరగడానికి వీలు లేదు, వారికి ఎక్కువ ప్యాకెట్ మనీ ఇచ్చేవారు.
మా నాన్నమ్మ ఇంటికి వెళ్తే అక్కడ నన్ను నా చెల్లిని ఒక విధంగా చూసేవారు కానీ మా తమ్ముడు బావని మాత్రం ఎంతో ప్రేమగా వారికి కావాల్సిన అంత స్వేచ్ఛ ఇచ్చేవారు.

ఇక మేము ఇద్దరం ఆడపిల్లలు పుట్టామని మా నాన్నమ్మ అమ్మను చాలా బాధపెట్టిందని అమ్మ స్వయంగా నాకు ఈ విషయాలు చెప్పింది.ఇలాంటి అసమానతలపై హోంటౌన్ అనే వెబ్ సిరీస్ వచ్చింది.ఆ సిరీస్‌కు చాలా కనెక్ట్ అయ్యానని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.
ఇలా సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలు పట్ల చూపే వ్యత్యాసం గురించి విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.