యూఎస్ లో విరూపాక్ష సెన్సేషన్.. ఏకంగా అన్ని కలెక్షన్స్ రాబట్టి..

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ( Karthik Varma Dandu ) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ”విరూపాక్ష”( Virupaksha ).ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Virupaksha Day 2 Usa Collections, Virupaksha, Sai Dharam Teja, Karthik Varma Dan-TeluguStop.com

మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే థియేటర్స్ కు రప్పిస్తుంది.కేవలం మౌత్ టాక్ తోనే వరల్డ్ వైడ్ గా పుంజుకుంటున్న ఈ సినిమా యూఎస్ లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ అయ్యింది.

అక్కడ ప్రీమియర్స్ తో పాటు బాగానే కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది.ఈ సినిమా యూఎస్ రిపోర్ట్ ప్రకారం ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కలిసి 2 లక్షల డాలర్స్ గ్రాస్ ను టచ్ చేసినట్టు అనౌన్స్ చేసారు.ఇక రెండు రోజుల్లోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్( Half Million Mark ) టచ్ చేసినట్టు తాజాగా వెల్లడించారు.దీంతో ఈ సినిమా క్రేజ్ ముందు కంటే మరింత పెరిగింది అనే చెప్పాలి.

అందులోను వీకెండ్ కావడంతో ఈ రోజు కూడా వసూళ్లు గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.సరిగమ సినిమాస్ వారు యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా ఈ సినిమా అక్కడ రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేసినట్టు తాజాగా అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేసారు.దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండ అయి సినిమా యూఎస్ ( USA Collections ) లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్( Sukumar ), బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ మధ్య కాలంలో సుకుమార్ అసిస్టెంట్స్ అంతా హీరోలకు మంచి మంచి హిట్స్ ఇస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా సుకుమార్ ఇచ్చిన కథతో ఈయన అసిస్టెంట్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube