సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ”విరూపాక్ష”.టైర్ 2 హీరోల్లో ఒకరైన సాయి తేజ్ కు ఈ సినిమా బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.
దాదాపు మూడేళ్ళ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని సాయి తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఆయన ఆశలకు నిజం చేసింది.మాములు హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.

సాయి తేజ్ ( Sai Dharam Tej ) హీరోగా యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు ( Karthik Varma Dandu ) తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘విరూపాక్ష‘ ( Virupaksha ).ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ముందు నుండి భారీ ప్రమోషన్స్ నడుము మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాతో సాయి తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు అనే చెప్పాలి.
విరూపాక్ష భారీ వసూళ్లను రాబడుతూ 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.ఇక 5వ రోజు కూడా బాగానే రాబట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా 5 రోజుల్లో ఎంత రాబట్టింది అనే దానిపై మేకర్స్ అఫిషియల్ గా రివీల్ చేసారు.5 రోజుల్లోనే ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేసారు.ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.అలాగే ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.చూడాలి లాంగ్ రన్ ఎప్పటికి పూర్తి అవుతుందో.







