సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది అని చెప్పుకోవచ్చు.అవును, సాధారణంగా ఓ సాధుజంతువుకి, క్రూర జంతువుకి జరిగిన యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది.ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న టక్కరి మొసలి పప్పులు ఉడకలేదు.
కాగా జింకను వెంటాడుతున్న మొసలి వీడియోను ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రి సోషల్ మీడియాలో షేర్ చేయగా వెలుగు చూసింది.ఈ వీడియోలో జింక నది దాటుతుండగా మొసలి దాన్ని వెంబడించడం స్పష్టంగా చూడవచ్చు.

ఈ వీడియోని షేర్ చేస్తూ “క్లైమాక్స్ టాప్ క్లాస్” అని మన డైరెక్టర్ చెప్పుకురావడం కొసమెరుపు.దాంతో ఈ వీడియోని చూడకుండా ఉండలేకపోతున్నారు మన నెట్టింట జనాలు.ఈ వైరల్ వీడియోను తొలుత విస్‌డమ్ ఆఫ్ ది లయన్ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేయగా పలు సోషల్ మీడియాలను ఇది కాస్త షేర్ అయింది.50 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో జింకను మొసలి ఛేజ్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది.ఇక వీడియో చివరిలో జింకకు అతిదగ్గరగా వెళ్లిన మొసలి దాన్ని దాదాపు మింగేయబోతుండగా జింక అతివేగంతో దాని బారి నుంచి తప్పించుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుకొని బయటబడటం చూడవచ్చు.

కాగా టాప్ క్లాస్ క్లైమాక్స్ క్యాప్షన్‌తో కాప్రి ఈ వీడియోను షేర్ చేయగా ఈ వీడియోను ఇప్పటివరకూ లక్షల్లో చూడడం కొసమెరుపు.ఇక లైక్స్ అయితే లెక్కలేనన్ని.అంతేకాకుండా నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆ జింకను ఆకాశానికెత్తేస్తున్నారు.
బలహీనుడు, బలవంతుడిపైన నెగ్గినపుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో మనవాళ్ళకి కూడా అదే ఫీలింగ్ కలుగుతోంది.దాంతో కామెంట్లతో రెచ్చిపోతున్నారు.







