టెలిగ్రామ్ లో ఈ కొత్త ఫీచర్స్ గమనించారా?

టెలిగ్రామ్ తెలియని భారతీయులు వుండరు.మనదేశంలో వాట్సాప్‌ తరువాత అంతలా ఆదరణ పొందిన యాప్ ఏదైనా వుంది అంటే అది టెలిగ్రామ్ అని చెప్పుకోవచ్చు.

 Have You Noticed These New Features In Telegram, Telegram, Account, New Features-TeluguStop.com

వాట్సాప్ విషయానికొస్తే రోజుకొక కొత్త అప్డేట్ తెస్తూ కోట్లాది మంది అభిమాన్ని కొల్లగొడుతోంది.ఈ క్రమంలో టెలిగ్రామ్‌ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది.

వాట్సాప్‌కు చెక్‌ పెట్టేలా సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు భోగట్టా.ఇందులో భాగంగా వాట్సాప్‌ పోటీని తట్టుకునేందుకు టెలిగ్రామ్‌ తాజాగా లేటెస్ట్‌ ఫీచర్స్‌ను విడుదల చేసింది.

వినియోగదారుల చాట్స్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసే ఫీచర్‌ ఒకదానిని జోడించింది.

Telugu Chat, Latest, Ups-Latest News - Telugu

అంతేకాకుండా ప్రొఫైల్‌ పిక్చర్‌, ఎమోజీ కేటగిరితో పాటు ఇతర ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌తో మొత్తం చాట్‌ను అత్యంత తేలికగా ట్రాన్స్‌లేట్‌ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కలదు.ఈ ఏడాదిలో టెలిగ్రామ్ దాదాపు 10 ప్రధాన ఫీచర్లను తీసుకువచ్చింది.అవి… ప్రొఫైల్ ఫోటో మేకర్, చాట్‌లను అనువదించడం, ఎమోజి వర్గాలు మరియు మరెన్నో వంటి ఫీచర్లను జోడించింది.టెలిగ్రామ్ వార్షిక సభ్యత్వం కోసం ఒకేసారి చెల్లించాలనుకునే వినియోగదారుల కోసం ప్రీమియం సభ్యత్వంపై 40 శాతం వార్షిక తగ్గింపును కూడా అందిస్తోంది.

Telugu Chat, Latest, Ups-Latest News - Telugu

ఇకపోతే, మనదేశంలోనే కాకుండా ఇతరదేశాల్లో కూడా మన టెలిగ్రామ్ హవా కొనసాగిస్తోందని టెలిగ్రామ్ మానేజ్ మెంట్ చెబుతున్నారు.కాగా టెలిగ్రామ్ విషయంలో కొన్ని రూమర్స్ కూడా లేకపోలేదు.టెలిగ్రామ్ వినియోగదారుల డేటా సెక్యూరిటీ విషయంలో, ఇంకా అనేక అసాంఘిక కార్యకలాపాలకు వేదిక అయిపోయిందని కొంతమంది ఆరోపిస్తున్నారు.ఇటువంటి తరుణంలో ఎలాంటి అప్డేట్స్ తెచ్చినా పెద్దగా ఉపయోగడం ఉండదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube