ఈ సువిశాల భూభాగంపై వేల మిలియన్ల రకాల జీవులు నివసిస్తున్నాయని చదువరులైన మీకు తెలిసిందే.అందులో కొన్నిటిని మనం రోజూ చూస్తూనే ఉన్నాం.
అయితే కొన్ని జీవులను మనం చూడలేము.చూసినా.
అది టీవీలోనో, మొబైల్‌లోనో చూస్తూ ఉంటాం.ఎందుకంటే చాలా జంతువులు మానవులు అడుగు పెట్టలేని ప్రదేశాలలో కూడా నివసిస్తాయి.
అంతేకాకుండా మన కంటికి కనబడని జీవులు కూడా ఇక్కడ మనుగడ సాధిస్తాయి.వాటిని చూసే సామర్థ్యం సామాన్యులకు ఉండదు.
అలాంటి జీవులను వింత జీవులు( Strange creatures ) లేదా రహస్య జీవులు అంటూ సామాన్యులు భావిస్తారు.
కాగా అలాంటి వింత జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ జీవిని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వింత జీవి పైకప్పు నుండి తలక్రిందులుగా గబ్బిలంలా వేలాడుతూ కనిపిస్తుంది.
దాని ముఖం మానవుల వలె ఉంటే.దీని రెక్కలు గబ్బిలంలా ఉన్నాయి.
మనుషులు, గబ్బిలాల మిశ్రమ జాతికి చెందిన జీవులను సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటారు.అయితే వాస్తవానికి ఇలాంటి జీవిని ఎవరూ చూడలేదు.
మానవ గబ్బిలం వంటి జీవి సీలింగ్ నుండి తలక్రిందులుగా వేలాడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.

ఈ జీవిని చూసిన వారు భయంతో వణుకుతున్నారు.మొదట దెయ్యమని భావించిన నెటిజన్లు ఆ తరువాత దానిని తేరిపారా చూసి ఇంత భయంకరంగా ఉందేమిటి అని ఆశ్చర్యపోతున్నారు.ఇక రాత్రిపూట ఎవరైనా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.
మనిషి గబ్బిలంలా కనిపించే ఈ జీవి నిజమా… ఫోటోషాప్ సాయంతో రూపొందించినదా లేదా సినిమా సీన్ అనే విషయంపై సరైన సమాచారం లేదు.ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
‘మేము సాధారణంగా గబ్బిలాలను చూస్తూనే ఉంటాం.అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న జీవి భయానకంగా ఉంది!’ ని కొందరు కొందరు దీనిని పిశాచం అని, మరికొందరు డ్రాక్యులా అని కామెంట్స్ చేస్తున్నారు.







