అన్నయ్య అంటే తండ్రి తరువాత తండ్రిలాంటివాడు అని మన పురాణాలు చెబుతున్నాయి.అయితే నేటి కార్పొరేట్ యుగంలో ఎంతమంది అలా బాధ్యతతో మెలుగుతున్నారో ఒకసారి గుండెలపైన చేయివేసి చూసుకోండి.
అన్న అంటే అమ్మలోని ఆప్యాయత, తండ్రిలోని అనురాగాన్ని పుణికిపుచ్చుకున్నవాడు అని అర్ధం.తల్లిదండ్రులతో పాటు, తోబుట్టువుల బాధ్యతను కూడా అన్న తన భుజస్కంధాలపైనే మోస్తాడు.
కనుకనే అన్నయ్యను తండ్రితో సమానంగా ఇక్కడ చూస్తారు.సోషల్ మీడియాలో అలాంటి అన్నకు అర్ధం చెప్పే వీడియో ఒకటి చర్చనీయాంశంగా మారింది.
ఇది చూసిన తర్వాత మీకు ఒక్క క్షణమైనా మీ అన్న గుర్తుకు వస్తాడు అనడంలో సందేహమే లేదు.అవును, కుటుంబంలో పెరిగే పిల్లలు చిన్నప్పటి నుంచే తమ బాధ్యతలను అర్థం చేసుకుంటారు.
ఇంటి పెద్దగా పుట్టిన పిల్లల్లో కొందరు వయసు మించిన పరిణితిని కనబరుస్తారు.ముఖ్యంగా మగపిల్లాడు కనుక ఇంటి పెద్ద అయితే.
అన్నయ్యగా మరింత బాధ్యతగా ఉండాలి.తనను తాను సంతోషంగా ఉంచుకుంటూనే.
తన తర్వాత పుట్టిన తమ్ముళ్ల, చెల్లెళ్ల బాధ్యతను సక్రమంగా చూసుకోవాలి.ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయిన ఒక వీడియో కుటుంబంలోని పిల్లల బంధం, బాధ్యత అందంగా కనిపిస్తూ.అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇక్కడ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, ముగ్గురు పిల్లలు ఒక దారిలో తమ ఇంటి వైపు వెళ్తున్నారు.అయితే ఇంటికి వెళ్లే మార్గంలో నీళ్ళు దండిగా వున్నాయి.దీంతో ముగ్గురూ రోడ్డుమీద ఆగిపోయారు.
అయితే అన్నయ్య ముందుగా తన చెల్లిని వీపుమీద ఎక్కించుకుని నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ తీసుకుని వెళ్లి.ఇంటి మెట్ల దగ్గర సేఫ్ గా దింపాడు.
మళ్ళీ వెనక్కి వచ్చి.తన వీపు పై తమ్ముడిని ఎక్కించుకుని నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ తీసుకుని వెళ్లి.
ఇంటి మెట్ల దగ్గర తమ్ముడిని దింపాడు.ఈ వీడియోను IPS అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
అన్నదమ్ములంటే ఇలాగే ఉంటారు.తల్లిదండ్రులు తమ విలువలతో కూడిన అపూర్వమైన వజ్రాన్ని చెక్కారని కామెంట్ జతచేశారు.







