Dog Skating : వైరల్ వీడియో: వావ్ ఈ కుక్క స్కేటింగ్ ఎలా ఆడుకుంటుందో చూడండి...

సోషల్ మీడియాలో యానిమల్ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.ఎందుకంటే ఇవి చాలామందికి నచ్చుతుంటాయి.

 Viral Video: Wow Watch This Dog Skating Dog, Viral Video, Viral News, Skating,-TeluguStop.com

ముఖ్యంగా డాగ్ వీడియోలను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.ఎక్కువ మంది కుక్కలనే తమ పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు కాబట్టి వారు ఇతర పెంపుడు కుక్కల వీడియోలకు కనెక్ట్ అవుతుంటారు.

కాగా తాజాగా ఒక వీడియోకి మరింత అట్రాక్ట్ అవుతున్నారు.ఈ వీడియోలో ఒక కుక్క మనుషుల వలె స్కేట్ బోర్డ్‌ పట్టుకొచ్చుకొని మంచుపై జారుతూ ఎంజాయ్ చేసింది.

ఇక వైరలవుతున్న వీడియోలో పెద్ద ఎత్తున మంచు పడి ఉండటం చూడవచ్చు.అయితే ఏటవాలుగా ఉన్న ఒక మంచు ప్రదేశం పైకి కుక్క ఎక్కుతూ కనిపించింది.దాని నోటిలో ఒక స్కేటింగ్ బోర్డు ఉంది.తర్వాత ది స్కేటింగ్ బోర్డు ఒక ఎత్తాటి ప్రదేశంలో ఉంచి దానిపై కూర్చొని కిందికి జారుతూ వెళ్ళింది.

అలా హాయిగా జారుతూ ఎంజాయ్ చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ ట్విట్టర్ అకౌంట్ @buitengebieden షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 38 లక్షల వ్యూస్ వచ్చాయి.1.75 లక్షల లైక్స్ వచ్చాయి.“వావ్, లైఫ్ ఎంజాయ్ చేయడంలో ఈ కుక్క తర్వాతే ఇంకే కుక్క అయినా” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.చిన్నపిల్లల వలె ఈ కుక్క చాలా సంతోషంగా స్కేటింగ్ బోర్డు తెచ్చుకొని స్లైడ్ చేయడాన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఈ బ్యూటిఫుల్ వీడియోని మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube