వైరల్ వీడియో: వీడెవడ్రబాబు.. యమధర్మరాజు కంటే డేంజర్ గా ఉన్నాడు..

పురాణాల ప్రకారం ఎవరైనా భూమిపై తప్పులు చేస్తే వారిని శిక్షించేందుకు యమధర్మరాజు( Yamadharmaraju ) యమలోకంలో ఉంటాడు అంటూ పెద్దలు చాలాసార్లు చెబుతూ ఉంటారు.

యమలోకంలో శిక్షించే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయని చాలా సినిమాల్లో కూడా వాటిని ఊహాగానాల రూపంలో అనేక సందర్భాల్లో చూపించారు.

నూనెలో వేయించడం.ఇంకా అనేక చిత్రవిచిత్ర శిక్షలుంటాయని వీడియోలు చాలానే చూసే ఉన్నాం.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి దోమలను యమధర్మరాజు కంటే ఎక్కువగా శిక్షించాడని చెప్పవచ్చు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

Viral Video Veedevadrababu Is More Dangerous Than Yamadharmaraju, Viral Video, S

వైరల్ గా మారిన వీడియోలో ఓ వ్యక్తి దోమను ఎన్ని రకాలుగా హింసించి చంపవచ్చో కళ్ళకు కట్టినట్లు చూపించాడు.ఈ వీడియోలో మొదటగా దోమను కుట్టు మిషన్( Mosquito sewing machine ) కింద ఉంచి సూదితో అనేకమార్లు దానిపై కూర్చోడం కనిపిస్తుంది.ఆ తర్వాత కరెంట్ షాక్ ఇవ్వడం.

Advertisement
Viral Video Veedevadrababu Is More Dangerous Than Yamadharmaraju, Viral Video, S

ఇంకా దోమను కింద పెట్టి పైనుంచి ఒక చాక్ లాంటి దానిని దానిమీద వేయగా అది కాస్త రెండు భాగాలుగా విడిపోవడం., ఇంకా ఒక దోమను రెండు అయస్కాంతాల మధ్యలో ఉంచి దానిని చంపడం.

అలాగే కత్తెర సహాయంతో దోమకు ఉన్న కాళ్ళను చేతుల్ని కట్ చేయడం అలాగే కొన్ని దోమలు ఉన్న ఓ కంటైనర్ ను తీసుకొని అందులో టపాకాయలను పేల్చి వాటిని చంపడం లాంటి వివిధ రకాలను వీడియోలో చూడవచ్చు.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video Veedevadrababu Is More Dangerous Than Yamadharmaraju, Viral Video, S

భయ్యా ఏంటి దోమల్ని ఎన్ని రకాలుగా హింసించి చంపవచ్చా.? నేను అసలు కలలో కూడా ఊహించలేదు అంటూ కొందరు కామెంట్ చేసి ఉండగా.మరికొందరు నువ్వు దోమల మీద పిహెచ్డి చేసినట్లు ఉన్నావు కాబోలు అంటూ సెటైర్ వేస్తూ కామెంట్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు