వైరల్: యోగా చేస్తున్న ఉడత.. ఆశ్చర్యపోయి చూస్తున్న నెటిజన్లు!

ఉడుత యోగా చేయడమేమిటి? అని అనుకుంటున్నారు కదా? నిజమేనండి.ఆ ఉడుత యోగా చేస్తోంది.

దానికి అందరు ఆశ్చర్య చకితులై చూస్తూ ఉండిపోతున్నారు.సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ ఇలాంటి చోద్యాలు బయటపడుతున్నాయి.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క మనిషికీ యోగా యెంత అవసరమో చెప్పాల్సిన పనిలేదు.తనను తాను ఫిట్‌గా ఉంచుకోవాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు.

దాని కోసం జిమ్‌లో గంటల తరబడి చెమటలు కక్కుతున్నారు.ఇవే కాకుండా తెల్లవారుజామున నిద్రలేచి మార్నింగ్ వాక్, యోగా చేసేవారు చాలా మందే ఉన్నారు.

Advertisement

ప్రజలు ప్రతిరోజూ యోగా, వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకున్నారు.అయితే.

మనుషులు వ్యాయామం చేయడం ఓకే గాని, ఇలాంటి జంతువులు యోగా చేయడం ఎపుడైనా చూసారా? కనీసం విని కూడా వుండరు కదూ.అయితే మీరు ఈ విషయం చదవాల్సిందే.దీనిని నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిది.

ఒక ఉడుత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు.

ఇందులో ఒక ఉడత తన చేతులు, కాళ్ళను సాగదీస్తూ నడుము సాగదీయడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.ఉడుతలు ఇలా వ్యాయామం చేయడం చూసి నెటిజన్లు చాలా ఇంప్రెస్ అవుతున్నారు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..

కేవలం కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఉడత ఇలా వ్యాయామం చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.వారి అభిప్రాయాలను కామెంట్లు గా ఇస్తున్నారు.

Advertisement

"ఆ ఉడతని చూసి మనం చాలా నేర్చుకోవాలి!" అని ఒకరు, "జంతువులు, పక్షుల నుంచి మానవులు చాలా నేర్చుకోవాలి!" అని మరొకరు, "ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారు, ఈ వీడియోను చూసి తీరాల్సిందే!" అని వేరొకరు.ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి.

తాజా వార్తలు