వైరల్: ఆ పిల్లాడిని టచ్ చేయద్దంటున్న కుక్క.. వాడు దాని ఫ్రెండ్ అంట!

విశ్వాసం విషయంలో శునకాలు మనుషులను మించిపోతుంటాయి.అందుకే విశ్వాసానికి మారుపేరుగా కుక్కల్ని చెబుతూ వుంటారు.

అది ఏ జాతికి చెందిన కుక్క పిల్ల అయినా, తన యజమాని పట్ల ఎంతోఅంకిత భావాన్ని కలిగి ఉంటుంది.అంతేకాకుండా యజమాని మొత్తం ఫ్యామిలీని తన కుటుంబంగా భావించి రక్షణ కల్పిస్తుంది.

ఇక చిన్నపిల్లపట్ల అయితే అవి ఎలా ప్రవర్తిస్తాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.చిన్నపిల్లల్ని వాటిదగ్గర ఉంచి, యజమానులు వాటి పనులు వారు చేసుకుంటూ వుంటారు.

ఆ క్షణం లో అయితే అవి పిల్లలమీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాయి.ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనకు తెలిసిందే.

Advertisement

తాజాగా అలాంటి వీడియో ఒకటి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తోంది.తాజాగా ఓ చిన్నారిని ఎవరైనా ముట్టుకుంటే ఖబడ్డార్.

మీ పని పడతా! అంటుంది ఓ పెంపుడు కుక్క.ఆ బుడ్డొడిపై చెయ్యి కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది.

ఆ వీడియోలో పసికందు పాలు తాగుతూ హాయిగా పడుకున్నాడు.ఆ చిన్నారి పక్కనే ఓ పెంపుడు కుక్క వాడిని అల్లారు ముద్దుగా చూసుకుంటుంది.

ఇక అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకువడానికి ప్రయత్నించగా.వెంటనే ఆ శునకం అతని చెయి పట్టేసి పక్కకు నెట్టింది.

వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!

అంతేకాకుండా మరోసారి అతని చేయి ముందుకు రాగా కాలుతో చేతిని పక్కకు లాగి అతడిని కోపంతో గుర్రుగా చూసింది.దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

అనుమానిత వ్యక్తుల నుంచి పెంపుడు కుక్కలు చిన్న పిల్లలను కాపాడతాయని.ఎంతో నమ్మకంగా ఉంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చిన్నారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆ బాబు తండ్రి కాదని.అందుకే ఆ కుక్క అతడిని ఆపుతుందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.