టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి ఖన్నా.
కాగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగులో శివమ్, ప్రతిరోజు పండగే,జోరు, జిల్,బెంగాల్ టైగర్, సుప్రీమ్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే రాశి ఖన్నా నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయిన పరవాలేదు అని అనిపించాయి.
కాగా ఈ ముద్దుగుమ్మ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పటివరకు 10 పైగా నటించినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కలేదు.
అంతేకాకుండా రాశి ఖన్నా కెరిర్ లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సరైన హిట్టు కూడా లేదు.హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చినప్పటికీ ఆమెకు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కూడా ఇవ్వలేకపోయాయి.
ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం థాంక్యూ.ఇందులో నాగచైతన్య సరసన నటించిన విషయం తెలిసిందే.
తాజాగా విడుదలైన ఈ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

అయితే ఈ సినిమా కోసం రాసి కన్నా కాస్త ఎక్కువగానే కష్టపడినట్లు వార్తలు వినిపించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, రాశి ఖన్నా టైం బాగోలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ అవి మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి.తెలుగులో ఇప్పటివరకు పలు సినిమాలలో నటించినప్పటికీ ఒక్క తెలుగు సినిమా కూడా ఈమెకు సరైన హిట్టును అందించలేకపోయింది.
కాగా కోలీవుడ్ లో ఈమెకు మంచి సక్సెస్ దక్కాయి.దీంతో చాలామంది రాశి ఖన్నా అభిమానులు ఆమె కోలీవుడ్ కే పరిమితమై అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి రాశి ఖన్నా తెలుగులోనే కంటిన్యూ అవుతుందా లేకపోతే కోలీవుడ్ కు వెళ్తుందా అన్నది చూడాలి మరి.







