మబ్బులను తాకిన అలలు.. అద్భుతమైన నేచర్ వీడియో వైరల్!

సోషల్ మీడియాలో వైరల్ కొన్ని నేచర్ వీడియోలు మనల్ని కట్టిపడేస్తుంటాయి.తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సముద్రంలోని అలలు భారీ ఎత్తుకు ఎగిసిపడ్డాయి.ఈ దృశ్యం చూస్తుంటే ఆకాశంలో మేఘాలను మబ్బులు ముద్దాడుతున్నట్లుగా అనిపించింది.

సాధారణంగా అలలు భారీ ఎత్తున ఎగిసి పడినప్పుడు ఒక నీటి పొర ఏర్పడుతుంది.అది చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది.

ఈ వీడియోలో అలలకు సంబంధించిన దృశ్యాలను చాలా స్పష్టంగా కనిపించాయి.దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ ట్విట్టర్ పేజీ బ్యూటెంగెబిడెన్ షేర్ చేసింది.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో సముద్రంలో అలలు ఎగసి పడటం చూడొచ్చు.ఈ దృశ్యాలను పెద్ద నౌక లో వెళ్తున్న ప్రయాణికులు తమ కెమెరాలో బంధించారు.

ఈ అలలకు ఫర్ఫెక్ట్ మ్యూజిక్ యాడ్ చేసినట్టు కూడా మీరు వినవచ్చు.ఈ దృశ్యాలు ఎంతో అందంగా కనిపించాయి.

సూర్యాస్తమయం అవుతుండగా అలలు ఉవ్వెత్తున పైకి లేచినట్లు కనిపిస్తోంది.ఈ కెరటాలు ఉప్పెనలై ఉగ్రరూపం దాచితే ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీరు గమనించవచ్చు.

ఈ దృశ్యాలను ఎక్కడ చిత్రీకరించారు అనేది తెలియరాలేదు.హవాయి, ఆస్ట్రేలియాలోని సముద్రంలో ఈ దృశ్యం కనిపించి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రకృతికి మించిన అందాలు ఎక్కడా లేవు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ వీడియోకి ఇప్పటికే 15 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్ష వరకు లైకులు వచ్చాయి.ఈ అద్భుతమైన వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement

తాజా వార్తలు