వైరల్ వీడియో: తన అంగవైకల్యం ఎందుకు పనికిరాదని నిరూపించిన పెళ్ళికొడుకు..!

కొంత మంది వారి చిన్న వయసు నుంచి అంగవైకల్య సమస్యతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురి అవుతూ ఉంటారు.

ఇక మరి కొందరయితే వారి అంగవైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఉన్నత శిఖరాలను చేరుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అలాగే తాజాగా ఒక కాలు కోల్పోయిన వ్యక్తి తన అంగవైకల్యాన్ని ఏ మాత్రం కుంగిపోకుండా పెళ్లి వేడుకలలో అదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.మరి కొన్ని భావోద్వేగాలకు గురి చేస్తూ ఉంటాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో లో పెళ్లి వేడుకల్లో భాగంగా పెళ్ళికొడుకు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిస్తు అందరినీ అబ్బుర పరుస్తున్నాడు.వరుడు పేరు అంకిత్ చౌహాన్ అతనికి ఒక కాలు లేకపోయినా సరే తన పెళ్లిలో చాలా అందంగా, అదిరిపోయే  డాన్స్ వేసి పెళ్లికి వచ్చిన బంధువులు అందర్నీ ఆకట్టుకున్నాడు.

Advertisement

ఈ క్రమంలో వధువు కూడా అంకిత్ చౌహాన్ వేసిన డాన్స్ కు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అతిథులు కూడా అతని డాన్స్ కి ఫిదా అయిపోయారు.  సోషల్ మీడియాలో ఈ వీడియోని వీక్షించిన కొంతమంది నెటిజన్స్ చక్కటి జోడి అని కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొందరు అంకిత్ డాన్స్ కొనియాడుతూ ఇరగదీసావ్ భయ్యా. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అంకిత్ డాన్స్ వీడియోను వీక్షించండి.

Advertisement

తాజా వార్తలు