వీడియో: మగబిడ్డకు ఫ్రెండ్ పేరు పెట్టిన వ్యక్తి.. ఫ్రెండ్ రియాక్షన్ ఇదే..

పేరు అనేది కేవలం పదం మాత్రమే కాదు.ఇది ఒక వ్యక్తి పాత్ర, గుర్తింపు గురించి చాలా చెప్పగలదు.

 Viral Video Man Gets Emotional As His Friend Names Newborn Son After Him Details-TeluguStop.com

అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ప్రత్యేకమైన అర్థం ఉన్న పేర్లను ఎంచుకుంటారు లేదా వారు మెచ్చే వారి పేర్లు( Names ) పెడతారు.ఒకరి పేరుకు స్ఫూర్తిగా నిలవడం గొప్ప గౌరవం.

ఆస్ట్రేలియాకు( Australia ) చెందిన రెక్స్ అనే వ్యక్తి కూడా ఫ్రెండ్ బిడ్డ పేరుకు స్ఫూర్తిగా నిలిచాడు.

తన ఫ్రెండ్( Friend ) తన మగబిడ్డకు తన పేరు పెట్టారని తెలుసుకున్నప్పుడు రెక్స్ ( Rex ) చాలా ఎమోషనల్ అయ్యాడు.

అతని స్నేహితుడు సోషల్ మీడియా యాప్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో వారి వీడియో చాట్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నాడు.రెక్స్ మగబిడ్డను( Baby Boy ) చూసి ఉద్వేగానికి లోనైనట్లు వీడియోలో చూపించారు.

వీడియోలో, “చిన్న టెక్స్ పెద్ద టెక్స్‌ను కలుసుకున్నప్పుడు” అనే క్యాప్షన్ రాశారు.

ఆ వీడియో ఆన్‌లైన్‌లో బాగా పాపులర్ అయింది.చాలా మంది దీన్ని లైక్ చేసి, కామెంట్స్ పెట్టారు.రెక్స్ రియాక్షన్ చూసి వీరు ఫిదా అయిపోయారు.

టెక్స్ అనే పేరు చాలా బాగుంది, ఆస్ట్రేలియన్ పిల్లవాడికి సరిపోతుందని వారు చెప్పారు.ఈ వీడియోకు కొన్ని గంటల్లోనే 70 వేల దాక లైక్‌లు వచ్చాయి.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.ఆ ఫ్రెండ్ వైఫ్( Friend Wife ) తన మగ బిడ్డ పేరును వెల్లడించడం మనం వీడియోలో చూడవచ్చు.

ఈ ఫ్రెండ్ పట్ల ఈ పేరెంట్స్ కి చాలా ప్రేమ కలిగి ఉన్నారకుంటా, అందుకే అలా పేరు పెట్టిందని మరి కొందరు అన్నారు.ఇలాంటి హార్ట్ టచింగ్ వీడియోలు చూస్తుంటే కన్నీళ్లు వస్తాయని మరికొందరు పేర్కొన్నారు.వీరి ఫ్రెండ్ షిప్ కలకాలం సంతోషంగా ఉండాలని మరికొందరు కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube