వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది.. ఇలా కూడా చేపలు పట్టొచ్చా..?

ఎవరి టాలెంట్ వారిది.ఇక్కడ బేసిగ్గా తాను ఎంచుకున్న రంగంలో ఎవరూ అంతగా తృప్తితో జీవించరు.

 Viral Video Man Caught Fishes From A Dam In A Strange Way Details, Viral Latest, News Viral, Social Media , Fish, Fishing , Man Catching Fish, Fishing Talent, Fishing From Dam, Viral Fishing Videos, Talent, Fishing With Hand-TeluguStop.com

అయితే కొందరు మాత్రం కొత్తగా ఆలోచన చేస్తూ తమ తమ రంగాల్లో దూసుకుపోతుంటారు.ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ విధానంలో బతుకున్నవారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి.

అలాంటివాటిని అధిగమించితే వారు సగటు ఉద్యోగి కంటే ఆనందంగా జీవిస్తారు.ఇక్కడ జరిగింది కూడా అలాంటిదే.

 Viral Video Man Caught Fishes From A Dam In A Strange Way Details, Viral Latest, News Viral, Social Media , Fish, Fishing , Man Catching Fish, Fishing Talent, Fishing From Dam, Viral Fishing Videos, Talent, Fishing With Hand-వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది.. ఇలా కూడా చేపలు పట్టొచ్చా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతగాడికి ఫిషింగ్ అంటే చాలా ఇష్టం.అయితే దానికోసం అతగాడు నదిలో ప్రయాణించలేదు, అలాగే సముద్రంలో కూడా ప్రయాణించి వ్యయప్రయాసలు పడలేదు.

కానీ అతగాడికి దండిగా చేపలు దొరికాయి.ఎలా అంటే.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో మీరు చూసినట్లయితే, అక్కడ యువకుడు చేపలను ఎంతో చాకచక్యంతో పట్టేస్తున్నాడు.ఒక డ్యామ్‌ మీద నిల్చొని, డ్యామ్‌ నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ కిందికి జారుతున్న చేపలను ఒడిసి ఎలా పట్టుకుంటున్నాడో చూడండి.

అక్కడ డ్యామ్‌ కింది భాగంలో చేపలు వేసే బుట్టలను ఉంచాడు.నీటి ప్రవాహానికి చేపలు ఎంచక్కా ఆ బుట్టల్లో పడుతున్నాయి.ఎలాంటి కష్టం లేకుండా నీటి ప్రవాహానికి వచ్చిన చేపలు కింద ఉన్న బుట్టలో పడిపోతున్నాయి.ఈ వ్యక్తి ఫిషింగ్ కోసం చేసే పద్ధతి నిజంగా ప్రత్యేకమైనదనే చెప్పాలి.

కాగా ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసింది.ఇతను చేపలు పట్టే విధానాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో జాక్‌ఫ్రూట్ అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది.ఎప్పుడో తీసిన వీడియో అయినప్పటికీ, తాజాగా బయటపడింది.ఈ వీడియోకు లెక్కలేని లైక్‌లు వస్తున్నాయి.అలాగే వేలాది మంది వీక్షిస్తున్నారు.

ఇక నెటిజన్లు ఎవరికి వచ్చినట్లు వారు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.ఒకసారి మీరు కూడా దీన్ని తిలకించి మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.