తాజాగా ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది.పచ్చని పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లికూతురుని పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు కొందరు.
అచ్చం సినిమాలో వలె కొందరు పెళ్లికూతురుని కిడ్నాప్ చేయడానికి వచ్చినప్పుడు బంధువుల కళ్ళలో కారం చెల్లి అమ్మాయిని తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేశారు.అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.
పెళ్లి మండపంలోని పెళ్ళికొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడు.పెళ్లి కూడా చేసుకున్నాడు.
మరో పెళ్లికి అతడు రెడీ కాగా దాంతో విషయం తెలిసిన భార్య.మరో పెళ్లికి అతడు రెడీ కాగా దాంతో విషయం తెలిసిన అమ్మాయి బంధువులు పెళ్లి మండపంలో ఉన్న వధువుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారు.

ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా( East Godavari District ) కడియంలో చోటుచేసుకుంది.మరికొద్ది సేపట్లో వివాహం పూర్తికానుండగా కొందరు కారం చల్లుతూ ఫంక్షన్ హాల్ లోకి ప్రవేశించి వధువును ఎత్తుకెళ్లగడానికి ప్రయత్నం చేశారు.కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకట నందు నరసరావుపేట లోని ఓ కళాశాలలో డిప్లమా చదివాడు.చదువుతున్న సమయంలో కర్నూలు జిల్లా గుడిగనూరు ( Kurnool )గ్రామానికి చెందిన అమ్మాయితో పరిచయం కాస్త ప్రేమగా మారండి.

దీంతో వారిద్దరూ ఏప్రిల్ 13న విజయవాడలో వివాహం చేసుకున్నారు.అయితే వెంకట నందు పెద్దలు అతనికి ఇంకో వివాహాన్ని నిశ్చయించడంతో ఏప్రిల్ 21న ముహూర్తం పెట్టారు.కాకపోతే ఆ విషయం తెలిసిన ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరో యువతులతో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పగా వెంటనే ఆమె తరపున బంధువులు వెళ్లి అక్కడ మండపానికి వచ్చి అక్కడ ఉన్న వధువును కిడ్నాప్ చేయబోయారు.ఈ ఘటనలో వరుడికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రేమించిన అమ్మాయి స్నేహ బంధువులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







