వైరల్ వీడియో: వర్చువల్ వాల్ ఎప్పుడైనా చూశారా.. దీని గుండా వెళ్లొచ్చు..

సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయ్యే కొన్ని టెక్నాలజీ వీడియోలు మనల్ని కట్టిపడేస్తుంటాయి.అవి నిజంగా నిజమేనా అని ఆలోచింపజేసేలా కూడా ఉంటాయి.

 Viral Video: Have You Ever Seen A Virtual Wall.. You Can Go Through It.. Viral-TeluguStop.com

అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది జనాలు నడుచుకుంటూ వెళ్లడం మనం చూడవచ్చు.

అయితే అక్కడే బ్లూ కలర్ గ్లాస్ లాంటి గోడ కూడా ఉండటం మనం గమనించవచ్చు.నిజానికి అది గోడ కాదు ఒక వర్చువల్ వాల్.

వర్చువల్ వాల్స్ అనేవి 3D నిర్మాణాలు, ఇవి ఆగ్మెంటెడ్ రియాలిటీ ( AR ) లేదా వర్చువల్ రియాలిటీ ( VR ) సాంకేతికతలను ఉపయోగించి భౌతిక ప్రపంచంలో క్రియేట్ చేస్తారు.వాటిని అక్కడక్కడ ప్రదర్శిస్తుంటారు.

అయితే వైరల్ వీడియోలో చూసిన వాల్ అనేది నిజమైన వాల్ లాగానే కనిపించింది.అందులో నుంచి వెళ్లేటప్పుడు నిజమైన గోడలో నుంచి వెళ్లినట్లే అక్కడి జనాలు ఫీలయ్యారు.అందుకే వావ్ అంటూ వారు అబ్బురపడటం మనం గమనించవచ్చు.ఈ వర్చువల్ వాల్‌ను లేజర్, స్మోక్ తో క్రియేట్ చేసినట్లు ఈ వీడియో షేర్ చేసిన యూజర్ పేర్కొన్నారు.

అందులోంచి వెళ్లడం వల్ల నిజమైన గోడ నుంచి వెళ్లినట్లే అనుభూతి కలుగుతుందని సదరు యూజర్ వివరించారు.ఈ టెక్నాలజీ( Technology )కి అందరూ క్లీన్ బౌల్డ్ అయ్యారు.

ఒక రియల్ పోర్టల్ నుంచి బయటికి వచ్చినట్లే అనుభూతి కలిగినట్లు వారు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు.

నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.అందులో నుంచి ఒక్కసారైనా వెళ్లాలి అని కొందరు తమ కోరికను బయటపెట్టారు.షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే వేలలో వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube