క్రికెట్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అనేక రకాల వీడియోలు వైరల్ గా మారడం గమనిస్తూనే ఉంటాం.తాజాగా క్రికెట్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
కాట్మండులో జరిగిన నెదర్లాండ్స్, నేపాల్( Netherlands, Nepal ) మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ పై నేపాల్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నెదర్లాండ్స్ మొదటి బ్యాటింగ్ చేయగా 19.3 ఓవర్లలో కేవలం 120 పరుగులు మాత్రమే జోడించి ఆల్ అవుట్ అయింది.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన నేపాల్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేరుకుంది.ఇకపోతే ఈ మ్యాచ్లో దీపేందర్ సింగ్ ( Deepender Singh )వేసిన ఫుల్ టాస్ డెలివరీ ని మెర్వే లాంగ్( Merway Long ) ఆన్ మీదుగా భారీ షాట్ ఆడాడు.
అయితే ఆ షార్ట్ చూసినా అందరూ కచ్చితంగా ఆ బాల్ సిక్స్ అని అనుకున్నారు.బాల్ సిక్స్ పోతే వెరైటీ ఎందుకు అవుతుంది కదా.ఇక్కడే నేపాల్ జట్టు ఫీల్డర్ బృతెల్( Fielder Brethel ) తన మెరుపులాంటి ఫీలింగ్ తో ఆ బంతిని బోౌండ్రి లైన్ దాటకుండా గాల్లోనే ఆపేసి గ్రౌండ్ లోకి తోసేసాడు.
ఇంకేముంది వెంటనే బృతెల్ ఆ బంతిని తీసుకొని వికెట్ కీపర్ కి నేరుగా విసిరేసాడు.దాంతో కీపర్ మెరుపు వేగంతో బ్యాటర్ ను రన్ ఔట్ చేసేసాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓసారి చూసేయండి
.