చిన్న ప్రశ్నకు 1.2 బిలియన్ వ్యూస్.. ట్విట్టర్‌లో మరో సంచలనం

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో( Twitter ) మరో సంచలనం చోటుచేసుకుంది.రోజూ ట్విట్టర్‌లో ఎన్నో విషయాలు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.

ఎంతోమంది తమ అభిప్రయాలను సామాజిక, రాజకీయ అంశాలు, ఘటనలపై ట్విట్టర్ లో పంచుకుంటూ ఉంటారు.అలాగే మోటివేషన్ కలిగించే సూక్తులను కూడా కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు.

అలాగే అనేక ఆసక్తికర విషయాలు ట్విట్టర్ లో వైరల్ గా మారుతూ ఉంటాయి.కానీ కొన్ని పోస్ట్ లు మాత్రం ఎందుకు వైరల్ అవుతాయో కూడా తెలియదు.

అలాంటి ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ట్విట్టర్‌లో ఒక యువతి పెట్టిన చిన్న ప్రశ్నకు తెగ వ్యూస్ వచ్చాయి.ఏకంగా చిన్న ప్రశ్నకు 1.2 బిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.కేవలం 11,000 మాత్రమే ఫాలోవర్లు ఉన్న ఒక యూజర్ చేసిన పోస్ట్ కు కేవలం నెలలోపే బిలియన్ వ్యూస్ కుపైగా రావడం సంచలనంగా మారింది.

దీనికి ఒక రికార్డుగా చెబుతున్నారు.తక్కువ ఫాలోవర్లు ఉండి ఎక్కువ వ్యూస్ వచ్చిన ట్వీట్ గా ఇది అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.అత్యధిక ఫాలోవర్లు ఉన్న యూజర్లు పెట్టిన పోస్టుకు కూడా ఇంత పెద్ద సంఖ్యలో వ్యూస్ రాలేదని చెబుతున్నారు.

విటౌట్ గూగులింగ్ నేమ ఏ ఫేమస్ హిస్టారిక్ బ్యాటిల్( Historical Battle ) అనే ప్రశ్న ఆమె నెటిజన్లకు సంధించింది.గూగుల్ చేయకుండా ఫేమస్, హిస్టారికల్ బ్యాటిల్ చెప్పండి అంటూ యువతి ఒక ప్రశ్న అడిగింది.ఈ ట్వీట్ కు 1.2 బిలియన్ కుపైగా వ్యూస్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.నెటిజన్లు ఈ ప్రశ్నకు వినూత్న రీతిలో సమాధానాలు చెబుతున్నారు.

కొంతమంది పెళ్లి అని, మరికొంతమంది భార్యాభర్తలంటూ సమాధానాలు చెబుతున్నారు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు