వైరల్: ఈ ఏనుగుకి బలుపు ఎక్కువైంది.. పోతూపోతూ ఏం చేసిందో చూడండి!

సోషల్‌ మీడియా ప్రపంచంలో అనునిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

 Viral This Elephant Has Gained Weight , Elephant, Viral Latest,news Viral, Vid-TeluguStop.com

ఇంకొన్ని చాలా ఎమోషనల్ గా ఉంటే.మరికొన్ని సిల్లీగా ఉంటాయి.

ఇకపోతే వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉండటం కొసమెరుపు.ఈ నేపథ్యంలోనే తాజాగా, ఓ ఏనుగు.

చాలా బలుపుని ప్రదర్శిస్తూ చాలా నవ్వుని తెప్పించింది.అచ్చం మనుషుల్లానే పోకిరిగా వ్యవహరిస్తూ చేసిన పనికి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

దాంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.ఇకపోతే సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఏనుగులు చాలా భీభత్సం సృష్టిస్తుంటాయి.అడవులు అంతరిస్తుండటంతో.తిండి కోసం సమీప ప్రాంతాల్లోకి ఇవి వెళ్ళిపోయి హల్ చల్ చేస్తుంటాయి.

కొన్ని సార్లు ఏనుగులు కోపంతో ఆస్థులకు నష్టం కలిగిస్తాయి.మరికొన్ని సార్లు మనుషులపై దాడులు చేస్తుంటాయి.

తాజాగా.ఓ ఏనుగు కూడా రాత్రివేళ భీభత్సం సృష్టించింది.

అయితే.ఇక్కడ కోపంతో ఉన్న ఏనుగు పోతూ పోతూ పోకిరి పని చేసి పోయింది.

వివరాల్లోకి వెళితే, అస్సాంలోని తేజ్‌పూర్ పట్టణానికి సంబంధించిన వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే… ఏనుగు ఆ రాత్రి వేళ అడవి నుంచి తప్పిపోయి వచ్చి తేజ్‌పూర్‌ వీధుల్లో హల్‌చల్‌ చేస్తూ తిరిగింది.సమీపంలోని భవనాల నివాసితులు ఈ ఏనుగు దృశ్యాలను చిత్రీకరించారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోలో.ఏనుగు కోపంతో ఊగిపోతూ వుంది.

ఆ సమయంలో దాన్ని చూసి ప్రజలంతా పరుగులు తీశారు.ఈ సమయంలో ఏనుగు రోడ్డు పక్కన ఆపి ఉంచిన బైక్‌ను.

ఓ తట్టు తన్నింది.అక్కడితో దానికోపం చల్లారలేదేమో.

బైక్‌ను తన్నిన తర్వాత ముందుకు వెళ్లిమరీ దాన్ని మరలా ఓ తన్ను తన్నింది.కాగా దీన్ని చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube