ప్రస్తుతం పెళ్లిళ్లు ఎక్కడ చూసినా సందడిగా మారుతున్నాయి.పెద్ద ఎత్తులో ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అంటూ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారు.
ఈ విషయంలో ఎవరు ఎక్కడా తగ్గడం లేదు.ఈ క్రమంలో పెళ్లిసందడిలో భాగంగా కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకి డాన్సులు రాకపోయినా ఫోటోగ్రాఫర్స్ బలవంతంతో డాన్సులు వేస్తున్నారు.
ఒకప్పుడు పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్, బంధువులు పెళ్లికొడుకును, పెళ్లికూతురును డ్యాన్స్ చేయమని బలవంతపెట్టినా సిగ్గుతో చేసేవారు కాదు.కానీ ఇపుడు ట్రెండ్ మారింది.
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తూ అదరగొడతున్నారు.
ఇక ఇక్కడ ప్రత్యేకించి కొత్త పెళ్లి కూతురు గురించి మాట్లాడుకోవాలి.
ఇదివరకు పెళ్లి కూతురు సిగ్గుపడుతూ మండపంలో తలదించుకుని కూర్చొండేది.అంతేకాదండోయ్, పెళ్లి అయిన వారం రోజులకు గాని, బయటకు వచ్చేది కాదు.
వచ్చిన సిగ్గుతో తలదించుకుని ఉండేది.అయితే ఇపుడు కాలానికి అనుగుణంగా పెళ్లి కూతురు కాస్త స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.
మండపానికి వస్తూనే అదిరిపోయే స్టెప్పులేస్తూ, చూపరులను ఆకర్షిస్తోంది.దాంతో పెళ్లి మండపం సందడిగా మారుతోంది.
ఇకపోతే పెళ్లి పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి పెళ్లి సందడి అయిపోయేవరకు అటు మగ పెళ్ళివారు, ఇటు ఆడపెళ్ళివారు ఇంటిల్లిపాది డ్యాన్స్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియా పరిధి పెరిగినప్పటినుండి సదరు డాన్సుల వీడియోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
రోజుకి ఇలాంటిది ఒక్కటైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం మనం గమనించవచ్చు.తాజాగా సదరు పెళ్లికొడుకు పెళ్లికూతురు మండపం స్టేజీపై మాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో షికారు చేస్తోంది.
రిసెప్షన్ లో భాగంగా కొత్త పెళ్లి జంట అందంగా ముస్తాబై ఫొటోలకు ఫోజులిస్తూ, సడెన్ గా అక్కడ ప్లే అయిన dj సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటున్నారు.వారికి డాన్సు కొత్తయినప్పటికీ ఎలాంటి జంకు బెరుకు లేకుండా స్టెప్పులేశారు.
మీరు కూడా ఓసారి లుక్కేయండి.







