వైరల్: జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కుమార్తె.. ఎవరో తెలుసా?

ప్రపంచ క్రికెట్ అభిమానులులలో ‘జో రూట్’ పేరు తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి.సెంచరీలు మీద సెంచరీలు అవలీలగా చేసే బ్యాటర్‌గా ఇతగాడికి మంచి పేరు వుంది.

 Viral: The Daughter Of The Former England Captain Who Clean Bowled Joe Root Does Anyone Know , Boo Root, Viral Latest, Bowld, Video Viral, Sports Update, Teams Sports-TeluguStop.com

ఇంగ్లండ్ చెందిన ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లను బెంబేలెత్తించాడు.ప్రస్తుతం అతను ఫామ్ ని కోల్పోకుండా మంచి స్వింగ్ లో వున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మొదటి 5 మంది ఆటగాళ్లలో అతగాడు ఒకడు.అలాంటి ఫామ్‌తో దూసుకెళ్తోన్న జో రూట్ ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ కుమార్తె బౌలింగ్‌ లో క్లీన్ బౌల్డ్ అవ్వడం అందరిని విస్మయానికి గురి చేసింది.

 Viral: The Daughter Of The Former England Captain Who Clean Bowled Joe Root Does Anyone Know , Boo Root, Viral Latest, Bowld, Video Viral, Sports Update, Teams Sports -వైరల్: జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కుమార్తె.. ఎవరో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు ఆమె ఆటతీరుకి ఫిదా అయిపోతున్నారు.ఈ క్రమంలో ఆమెను ఆకాశానికెత్తుతున్నారు.జో రూట్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్‌ని ఆడుతున్న సంగతి తెలిసినదే.

ఈ మ్యాచ్‌ హెడింగ్లీ వేదికగా జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 360 పరుగులు చేయగా, జో రూట్ 5 పరుగులు మాత్రమే చేశాడు.కానీ, సిరీస్‌లోని 5 ఇన్నింగ్స్‌లలో, అతను 2 సెంచరీలతో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు.

మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకు 2 సెంచరీలు చేసిన జో రూట్.పాల్ కాలింగ్‌వుడ్ కుమార్తె బౌలింగ్‌ లో ఔట్ అయిపోవడం ఒకింత విడ్డురమే అని చెప్పుకోవాలి.

అయితే అదంతా సరదాగా ఆడిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్ అని చూసినవారికి అర్ధం అయిపోతుంది.అయితే ఏదిఏమైనా ఖచ్చితమైన ఇన్‌స్వింగర్‌తో జోరూట్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం మామ్మూలు విషయం కాదు.

దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.కాగా, పాల్ కాలింగ్‌వుడ్, తన కూతురిని దగ్గరుండి మరీ కోచింగ్ ఇస్తున్నాడు.

బౌలింగ్‌లో రకరకాల బంతులను ఉపయోగించి, ప్రాక్టీస్ చేయిస్తున్నాడు.