ఎన్టీఆర్ సలహా రాజనాల వినలేదట.. అందుకే చివరి దశలో అంతటి దుర్భర పరిస్థితి?

ప్రస్తుత సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది విలన్లు ఉన్నారు.పరభాషా నటులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్లుగా రాణిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

 Rajanala Felt Bad About Sr Ntr Deails, Rajanala, Legendary Actor Rajanala, Villa-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మాత్రం విలన్ అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం ఆయనే గంభీరమైన కంఠమే.ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను భయపెడుతూ ఉండేవి.

అంతేకాదు ఆయన విలనిజాన్ని పండిస్తూ ఉంటే ప్రేక్షకుడు మంత్రముగ్ధుడు అయి పోతూ ఉండేవాడు.ఆయన ఎవరో కాదు రాజనాల.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రాజనాల చివరి రోజుల్లో మాత్రం దుర్భర స్థితిని గడిపారు.

రాజనాలకి అలాంటి పరిస్థితి రావడానికి అటు ఎన్టీఆర్ మాట వినకపోవడం అన్నది అర్ధమవుతుంది.

ఎన్టీఆర్ చెప్పిన మాట విని ఉంటే రాజనాల చివరి దశలో కూడా ఎంతో బాగా జీవించి ఉండేవారట.అన్నగారు పాలిటిక్స్ లోకి రాకముందు సినిమా పరిశ్రమలో ఎంతో మందితో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది కెరీర్లో ఉపయోగపడే సలహాలను కూడా ఇచ్చేవారు.ఇలా ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉన్న వారిలో రాజనాల కూడా ఉన్నారు.

అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తనకు అండగా ఉండాలని కోరితే ఎంతోమంది సన్నిహితంగా ఉన్న వారే తిరస్కరించారట.మొదటి దశలో ఆయన వెంట నడిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట.

Telugu Nandamuritaraka, Ntr Rajanala, Rajanala, Senior Ntr, Sr Ntr, Telugu Desha

ఈ క్రమంలోనే రాజనాల ను కూడా తనతో పాటు ఉండాలని ఎన్టీఆర్ సలహా ఇచ్చారట.కాని రాజనాలా మాత్రం ఎన్టీఆర్ సలహా పాటించ లేదట.అయితే కొంతమంది ఎన్టీఆర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తే రాజనాల కనీసం ప్రచారం కూడా రాలేదట అయితే ఇక ఆయన సినీ కెరీర్ ముగిసిన తర్వాత ఓ రోజు మీడియాతో మాట్లాడిన రాజనాల అప్పుడు ఎన్టీఆర్ చెప్పినట్లుగా రాజకీయాల్లో వెళ్లి ఉంటే ఇక ఇప్పుడు రాజకీయంగా స్థిరపడి మంచి జీవితాన్ని గడిపే వాడిని ఎన్టీఆర్ సలహాను అప్పుడు పాటించలేదు అంటూ గుర్తు చేసుకున్నారట.చివరి దశలో రాజనాల దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చనిపోయే ముందు వరకు కూడా ఎన్నో బాధలు పడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు అని ఇప్పటికీ సినీరంగ పెద్దలు చెబుతూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube