వైరల్: కేవలం 7 మామిడి పండ్లకు ఇంత సెక్యూరిటీనా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి కదా.ఎండల మాట పక్కన పెడితే వేసవి కాలం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు.

ఎందుకంటే వేసవి సీజన్ లో మామిడి పండ్లు విరిగిగా దొరుకుతాయి కాబట్టి.మామిడి పళ్ళు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.

దానిని మించిన పండు మరొకటి లేదు.అందుకే మామిడి పండును పండ్లలో కంటే రారాజు అని పిలుస్తారు.

అయితే మామిడి పండు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు.ఈ పండు సీజనల్ టైమ్ లో మాత్రమే దొరుకుతుంది.

Advertisement

ఆ సమయంలో మామిడి పండ్లకు గిరాకీ బాగా ఉంటుంది.అయితే భోపాల్ లో ఉన్న మామిడి చెట్టుకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది తెలుసా.ఆ మామిడి చెట్టుకు కాసిన మామిడి పండ్లు కేజీ రూ.2.70 లక్షల ధర పలుకుతుందట.ఏంటి అంత ధరా.అని షాక్ అయ్యారా.? కానీ మీరు విన్నది నిజమే అండి.అంతేకాదు ఆ చెట్టుకి ఆరు శునకాలు, నలుగురు సిబ్బంది కూడా కాపలాగా ఉన్నారు తెలుసా.

ఇంతకీ ఆ చెట్టుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి.? అసలు అంత ధర పలకడానికి కారణం ఏంటి.? అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌ పూర్ జిల్లాకు చెందిన రాణి, సంకల్ప్ పరిహార్ అనే దంపతులు తమ మామిడి తోటలో ఒక రెండు మామిడి మొక్కలను నాటారు.

అయితే అవి పెరిగి పెద్దవడంతో ఆ చెట్లకి పోయిన సంవత్సరం వాటికి మామిడి పండ్లు కాచాయి.అవి పండిన తరువాత వాటిని గమనిస్తే అవి పసుపు రంగులో కాకుండా రూబీ కలర్‌ లో ఉన్నాయి.చివరకు అవి జపాన్‌ కు చెందిన మియాజాకీ మామిడి పండ్లు అని తేలింది.ఆ మామిడి పండ్ల ధర అంతర్జాతీయ మార్కెట్‌ లో ఏకంగా కిలో రూ.2.70 లక్షలుగా పలుకుతుంది.ఈ మామిడి పండ్లకు భారీ ధర పలకడంతో పోయిన ఏడాది చెట్లకు కాచిన మామిడి పండ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.

మళ్ళీ ఈ ఏడాది ఆ రెండు చెట్లకు 7 మామిడి పండ్లు కాచాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

మళ్ళీ వాటిని ఎవరన్నా దొంగిలిస్తారేమో అనే అనుమానంతో ఆ 7 పండ్లకు 6 శునకాలను, నలుగురు సిబ్బందిని కాపలాగా ఉంచారన్నమాట.ఈ మామిడి పండ్లు ఇండియాలో పండే పండ్ల మాదిరిగా ఉండవు.రూబీ కలర్‌ లో ఉండి, అంతర్జాతీయ మార్కెట్‌ లో అత్యంత డిమాండ్ కలిగి ఉంటాయి.

Advertisement

ఆ మామిడి పండ్లు అత్యంత అరుదుగా మన దేశంలో పండుతాయి కాబట్టి వీటికి అంతా డిమాండ్ ఉంది మరి.

తాజా వార్తలు