వైరల్: నెదర్లాండ్స్‌లో వున్న రివర్స్ బ్రిడ్జ్‌ని చూస్తే మీకు మతిపోతుంది!

అవును, అక్షరాలా నిజం.కొన్ని ఇంజినీరింగ్ అద్భుతాలు చూడటానికి ఆశ్చర్యకరంగానే కాకుండా దీన్ని ఎలా తయారు చేశారనే ఆలోచన కలిగేవిలాగా ఉంటాయి.

 Viral Reverse Bridge In Netherlands Is An Engineering Excellence Details, Nether-TeluguStop.com

ఇప్పుడు అలాంటి ఒకదానిని గురించి తెలుసుకుందాం.నెదర్లాండ్స్‌లో రూపొందించిన ‘రివర్స్ బ్రిడ్జ్’ దీనికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

దీని వీడియోను వాలా అఫ్షర్ అనే వినియోగదారుడు తాజాగా ట్విట్టర్‌లో పంచుకున్నారు.ఈ క్లిప్‌ చూసినట్లయితే కార్లు వంతెనపై ప్రయాణిస్తున్నట్లు మరియు నిర్మాణం మధ్యలో ఉన్న నీటి స్ట్రిప్ కింద కనిపించకుండా పోతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అదెలా సాధ్యం అనే ఆలోచన కలుగుతుంది కదూ.అవును, కార్లు అవతలి వైపు నుండి బయటకు రాకముందే నీటి అడుగున అదృశ్యమైనట్లు ఒక భ్రమ అనేది కలగక మానదు.వంతెన నీటి మట్టం కంటే కొంత కాలం దిగువకు వెళ్లే విధంగా వంతెనను ఇక్కడ రూపొందించారు.దాని పైన ప్రవహించే నీటి స్ట్రిప్ గుండా పడవలు వెళ్లేందుకు వీలుంది చుడండి.“నెదర్లాండ్స్‌లోని ‘రివర్స్ బ్రిడ్జ్’ డిజైన్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్,” అని వీడియోకి శీర్షిక పెట్టారు.

కాగా ఇది డచ్ నగరమైన హార్డర్‌విజ్క్ సమీపంలో ఉంది.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ ద్వీపం అయిన ఫ్లేవోలాండ్.ఇది వేరొక ద్వీపంతో ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది.2002లో ప్రారంభించబడిన వెలువేమీర్ అక్విడెక్ట్ వాహనాల రాకపోకలతో పాటు నీటి ద్వారా వచ్చే ట్రాఫిక్‌ను మరొకదానితో పాటు అడ్డంకులు లేకుండా దాటేలా ఇది చేస్తుంది.గురువారం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 5.3 మిలియన్ల వీక్షణలను పొందటం విశేషం.కాగా కొందరు నెటిజన్లు “అమెరికాలో ఇలాంటివి ఎందుకు లేవు?” అని ప్రశ్నించగా, “సాధారణ ప్రజలు దీనిని సొరంగం అని పిలుస్తారు,” అని మరొకరు కామెంట్ చేసారు.“ఇది చాలా బాగుంది.ఫ్లైఓవర్ బ్రిడ్జి కంటే దీనికి తక్కువ ఖర్చవుతుందా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube