ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా రిలీజై సంవత్సరం కావస్తోంది.అయినా ఆ సినిమా తాలూక రీ సౌండ్ ఇంకా వినబడుతోంది.
తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో నాటు.నాటు పాట అవార్డు దక్కించుకోవడంతో రాజమౌళి ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తోంది.
రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన నాటు నాటు పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి( MM Keeravani ) స్వరాలు సమకూర్చగా చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించడం విశేషం.ఈ నేపథ్యంలో ఎంఎం కీరవాణికి, చంద్రబోస్ అవార్డులు అందుకున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన మొదట్లోనే కొన్ని కోట్ల మంది నాటు నాటు అంటూ కాలు కదిపారు.ఈ పాటతో అనేకమంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా.వారిలో చాలా మంది సెలబ్రిటీస్ సైతం ఉండడం కొసమెరుపు.ఇక అస్కార్ అందుకున్నాక నాటు నాటుకి మరింత ఆదరణ పెరిగిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.
తాజా నివేదిక ప్రకారం పరిశీలిస్తే….ఆస్కార్ రాకముందు కంటే వచ్చిన తర్వాత 10 రేట్లు ఎక్కువగా దీని గురించి సెర్చ్ చేసినట్లు నివేదికలు చెబుతుండడం విశేషం.ఇక మరోసారి సోషల్ మీడియాలో నాటు నాటు అంటూ డ్యాన్స్ లు చేస్తూ కొందరు సెలిబ్రిటీలు రచ్చ రచ్చ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా భారత్ మాజీ క్రికెటర్స్ హర్భజన్ సింగ్, సురేష్ రైనా( Harbhajan Singh, Suresh Raina ) కలిసి నాటునాటు పాటకు డ్యాన్స్ చేసి ఆహూతులకు కనుల విందు చేశారు.
అవును, లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇండియా మహరాజాస్ తరఫున ఆడుతున్న వీరు ఇద్దరూ మైదానంలోనే ఫ్రీ గా వున్నపుడు స్టెప్స్ వేస్తు కనిపించారు.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.