ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వంటలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.అందులో కొన్ని జనాలకు నచ్చితే మరికొన్ని వంటకాలు నెటిజనాలకు వెగటు పుట్టిస్తాయి.
తాజాగా ఆ రకమైన రెసిపీకి చెందిన వీడియో ఒకటి జనాలకి కితకితలు పెడుతోంది.టీ అంటే ఇక్కడ ఇస్టపడనివారు ఎవరుంటారు చెప్పండి? అది కేవలం ఒక పానీయం కాదు అదొక ఎమోషన్ మన జనాలకి.విదేశాల నుండి భారతదేశానికి వచ్చినా టీని భారతీయులు అక్కున చేర్చుకున్నారు.ఎంతగా అంటే టీ అంటే పడి చస్తారు ఇక్కడ.టీ ఉడుకుతున్న వాసన వస్తే చాలు మనోళ్ళు గాల్లో తేలిపోతారు.

మరీ ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కలకత్తా( Hyderabad, Mumbai, Delhi ) వంటి నగరాల పేర్లతో టీలు ప్రసిద్దికెక్కాయి అంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.అయితే సోషల్ మీడియా వచ్చిన తరువాత కొందరు ఇంత మంచి అనుభూతిని పాడు చేస్తూ కొత్త కొత్త పద్ధతుల్లో టీ ని చేస్తూ వుంటారు.అలాంటి కోవకు చెందినదే ఈ మహిళ కూడా.
ఈమె తయారుచేసిన టీ ( tea )చూస్తే వాంతి రావడం ఖాయం.అవును, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘మీ సొంత పూచీకత్తు మీద ఈ వీడియో చూడండి’ అని నెటిజన్లు అంటున్నారు.

అసలు అందరూ అంతలా అసహ్యించుకోవడానికి ఆమె ఏం చేసిందో ఒకసారి చూస్తే.మీకు మతిపోతుంది.సాధారణంగా టీ పౌడర్( Tea powder ) నుండి టీ తయారీ వరకు ఎన్నో వెరైటీలు ఉన్నాయి.
అల్లం, యాలకులు, లవంగం, మసాలా, తందూరీ ఇలా చాలా రకాల టీలు తయారుచేస్తారు.కానీ ఈ బెంగాలీ మహిళ మాత్రం జీవితంలో ఎవ్వరూ చూడని, అసలు ఊహించని టీని తయారుచేసింది.
ఒక గిన్నెలో టీ పొడి, పాలు వేసి టీ ఉడికించి, సడన్ గా ఆ టీ లోకి ఒక చేప ముక్కను వేస్తుంది.ఆ చేప ముక్క టీతో పాటు బాగా ఉడికిన తరువాత దాన్ని టీలో నుండి తీసేసి గ్లాసులోకి వడగడుతుంది.
ఆ తరువాత ఒక ఐస్ క్రీం పుల్లకు అంతకుముందే టీలో ఉడికిన చేప ముక్కను గుచ్చి దాన్ని టీ గ్లాసులో ఉంచింది.తరువాత దీన్ని ఫిష్ టీగా పేర్కొంది.
దాంతో ఆ దృశ్యాలను చూసిన నెటిజనం ఆమెపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.







