తెలంగాణలో బిజెపి( Telangana bjp )ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర బిజెపి పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు.గెలుపుకు అవసరమైన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
తెలంగాణలో బిజెపి గెలిచేందుకు అవకాశం ఉన్నా, పార్టీ నాయకుల్లో సరైన సమన్వయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలు ఇవన్నీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయని అధిష్టానం గుర్తించింది .వీటన్నిటిని పరిష్కరిస్తూనే టిఆర్ఎస్ కాంగ్రెస్ లపై పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు అంతా తెలంగాణకు క్యూ కడుతున్నారు.ప్రధాని నరేంద్ర మోది ( Narendra Modi )పాలమూరు సభలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.అలాగే నిజామాబాద్ లోనూ పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు .8021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

రామగుండంలో ఎన్టిపిసి నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ లో 800 మెగావాట్ల తొలి యూనిట్ ను జాతికి అంకితం చేశారు. ఆయుష్మాన్ భారత్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రులలో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన చేశారు.1200 కోట్లతో నిర్మించిన సిద్దిపేట మనోహరాబాద్ రైల్వే లైన్ ను సిద్దిపేట సికింద్రాబాద్ తొలి రైల్వే సర్వీస్ ను ప్రారంభించారు. అంతకుముందు పాలమూరు సభలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్ లో పసుపు బోర్డు ను ప్రకటించారు .ఈ విధంగా తెలంగాణ బిజెపిలో జోష్ నింపారు.ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం ఎన్నెన్ని నిధులు ఇచ్చి ఏ విధంగా అభివృద్ధి చేసిందనే విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు .

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సభలో పెట్టేలా కిషన్ రెడ్డి( Kishan Reddy ) అధ్యక్షతన ప్లాన్ చేస్తున్నారు .బెంగాల్లోనూ ఇదే రకమైన వ్యూహంతో బిజెపి ఎన్నికలకు వెళ్ళింది.అక్కడ వరుస వరుసగా కేంద్ర బిజెపి పెద్దలంతా పర్యటించారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులను గురించి బిజెపి పెద్దలే స్వయంగా ప్రకటించడం జనాల్లోకి వెళ్ళింది .ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యింది.బెంగాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేని స్థాయిలో ఉన్న బిజెపి, అక్కడ ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది .ఇదే తరహా వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని బిజెపి భావిస్తోంది.గతంలో బెంగాల్ తో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో బిజెపి బలంగానే ఉంది.
వరుస వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ బిజెపి అగ్ర నేతలు అంతా తెలంగాణలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయి.







