సాధారణంగా మనం రోడ్డు మీద ప్రయాణించేతప్పుడు మలుపులు తిరిగే సమయంలో ఇండికేటింగ్ సిగ్నల్( indicating signal ) వేయడం తప్పనిసరి.లేదంటే పెను ప్రమాదాలు సంభవించవచ్చు.
అందుకే వాహన తయారీదారు కంపెనీలు ఇలాంటి సిగ్నల్ లైట్స్ ని ఏర్పాటు చేసాయి.అవి వేయడం వల్ల జరగకూడని ప్రమాదాలను తేలికగా అరికట్టవచ్చు.
మరి అలాంటి లైట్స్ పనిచేయనప్పుడు చాలామంది చేతులను అడ్డుపెడుతూ వుంటారు.అది కూడా మంచిదే గాని, సిగ్నల్ లైట్స్ కి అలవాటుపడిన జనాలు చేతులను గమనించకపోయే ప్రమాదం వుంది.

మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇదే నేపథ్యంలో ఓ యువకుడు భలే ఆలోచన చేసాడు.తన బైక్‌కి సిగ్నల్ లైట్ ( Signal light for bike )లేకపోయినా వెనుక వచ్చేవారి కోసం ఇండికేట్ చేశాడు.ఎలాగో తెలుసా? అదే అతని తెలివి.ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ యువకుడు అతి తెలివితోనే చేసినా, అతను చేసిన పని.బైక్‌కి సిగ్నల్ లైట్ లేని సమయంలో కూడా ఎలా సిగ్నల్ వేయవచ్చో నెటిజన్లకు డెమో ఇచ్చినట్లయింది.అవును, దాంతో సదరు వీడియోపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో విషయానికి వస్తే.అందులో ఓ ఇద్దరు యువకులు బైక్( Young people bike ) పైన వెళ్లడాన్ని మనం గమనించవచ్చు.అలా వారు పయనిస్తూ ఒకదగ్గర యూటర్న్ తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది.
ఆ సమయంలో వెనక నుంచి వచ్చే వారి కోసం సిగ్నల్ వేశారు.వారు నడిపే బైక్‌కి సిగ్నల్స్ లేవు గనుక వెనుక కూర్చున్న యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెనక్కు చూపించి సిగ్నల్ ఇచ్చాడు.
కాగా దీనికి సంబందించిన వీడియో కాస్త ట్రెండ్ అవడం ప్రారంభించింది.జూల్ 24న ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నుంచి షేర్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకు 5 లక్షల వరకు లైకులు, 78 లక్షల వరకు వీక్షణలు, 7 వందల వరకు కామెంట్లు వచ్చాయి.
నెటిజన్లు ఐడీయా నిజంగా అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు.







