వైరల్: బోనులో సింహాలు జనసంద్రంలో కలిసిపోయాయి... భయానక దృశ్యం!

సర్కస్‌లో జరుగుతున్న ఆశ్చర్యకరమైన విన్యాసాలను చూస్తూ జనాలు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.ఇంతలో ఊహించని సంఘటన.

 Viral Lions In A Cage Mingled With The Crowd A Scary Sight-TeluguStop.com

సర్కస్‌లో ఫీట్లు చేస్తున్న 2 సింహాలు ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకుని ఒక్కసారిగా జనంపైకి ఎగబడ్డాయి.దాంతో సర్కస్‌ చూసేందుకు వచ్చిన ప్రజలంతా.

ఒక్కసారిగా తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయంతో పరుగులు పెట్టారు.ఈ భయానకమైన ఘటన చైనా( China )లో చోటు చేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇక్కడ అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం అదృష్టం.సర్కస్‌ ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో నిర్వాహకులు సింహాలతో విన్యాసాలు చేసేందుకు యత్నించగా ఓ రింగ్‌ లోంచి దూకేందుకు సింహాలు( Lions ) మొరాయించడంతో వాటితో బలవంతంగా విన్యాసాలు చేయించేందుకు ట్రైనర్లు ట్రై చేసారు.ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో సరిగా లాక్‌ చేయని డోర్‌ నుంచి 2 సింహాలూ ఒక్కసారిగా బయటకు దూకాయి.

దీంతో గ్యాలరీల్లో కూర్చొని వీక్షిస్తున్న జనానికి ఏం చేయాలో

తెలియక భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు.

గా ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సర్కస్‌ను నిలిపివేయాలని ఆదేశించారు.ఇకపోతే ఆ సింహాలు ఎలా తప్పించుకున్నాయనేది మాత్రం సర్కస్‌ నిర్వాహకులు వెల్లడించకపోవడం గమనార్హం.కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో వియ్ అర్ నాట్ ఫుడ్ వేదికగా షేర్ చేయడం జరిగింది.ఇక వైరల్‌గా మారిన వీడియోలో సింహాలలో ఒకటి సర్కస్ వెలుపల తిరుగుతూ కనిపించింది.

సింహాన్ని పట్టుకున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్( Police station ) అధికారులు తెలిపారు.వీడియోలు కూడా సింహాన్ని బోనులో బంధించినట్టుగా తెలుస్తోంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube