సాధారణంగా డ్రైవింగ్ అంటే ఎంతో ఇస్టమైన మనకి హైవే రోడ్లలో ప్రయాణం అంటే యమ మజాగా వుంటుంది.ఎందుకంటే రోడ్లన్ని ఎంతో విశాలంగా వుంటాయి కనుక.
అంతేకాకుండా అక్కడ ఎంత స్పీడుగానైనా డ్రైవ్ చేయొచ్చు.అదేసమయంలో అదే ప్రమాదకరం కూడా.
ఎందుకంటే ప్రమాదాలు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి.మరోవైపు అడుగడుగునా టోల్గేట్లు తారసపడుతూ వాహనాల వేగానికి బ్రేకులు వేస్తుంటాయి.
ఇది చాలా మంది డ్రైవర్లకు చికాకు తెప్పించే విషయం.ఈ క్రమంలో కొందరు డ్రైవర్లు టోల్‌గేట్( Tollgate fee ) ఫీజు కట్టకుండా ఉండేందుకు పక్కదారులు వెతుకుతుంటారు.
ఇంకొందరు డ్రైవర్లు టోల్‌గేట్ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతుంటారు.
తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి చూస్తే ఓ హైవేపై వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌కు ఎదురుగా టోల్‌గేట్ కనిపించింది.టోల్ ఫీజు చెల్లించి వెళ్లాల్సి ఉండగా.
అందుకు అతగాడు విరుద్ధంగా ప్రవర్తించాడు.టోల్‌గేట్ వద్ద ఆపినట్లే ఆపి వాహనాన్ని ముందుకు కదిలించాడు.
దీంతో టోల్ గేట్ సిబ్బంది బండిని ఆపే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో డ్రైవర్( Driver ) డోరు పక్క నుంచి లోపలికి ఎక్కే ప్రయత్నం చేశాడు.
అప్పటికే కోపంతో ఉన్న ట్రక్కు డ్రైవర్.వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళతాడు.
దాంతో షాక్ అయిన సిబ్బంది వాహనాన్ని పట్టుకుని వేలాడుతూ వుంటాడు.అలా వేలాడలేక ”ఒరే టోల్ ఫీజు తర్వాత.ముందు బండి ఆపురా నాయనా”.అని వేడుకుంటాడు.అయినా డ్రైవర్ మాత్రం వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్తాడు.ఇక ఎక్కడ కిందపడతానో అనుకుంటూ సదరు అధికారి మాత్రం అలాగే భయం భయంగా వాహనాన్ని పట్టుకుని డ్రైవర్‌తో మాట్లాడుతూ వుంటాడు.
ఈ ఘటనను మొత్తం ట్రక్కులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.కాగా దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.