ఒకటి రెండు ఘాటు మిరపకాయలను( Chillies ) నంజుకు తింటామంటేనే చాలా బాధగా వుంటుంది.అలాంటిది ఏకంగా 135 మిరపకాయలను క్షణాల్లో తినేయడమంటే అంత తేలికైన విషయం కాదు.
కానీ అతగాడు క్షణాల్లో ఆరగించేశాడు.దాంతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.
సాధారణంగా మనలో కొందరుఘటుగా ఉండే ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతుంటారు.మరికొందరు నేరుగా పచ్చి మిరపకాయలనే తినేస్తుంటారు.
ఇతగాడు కూడా అదే కోవకు చెందినవాడులా వున్నాడు.కేవలం 6 నిమిషాలలో 135 మిరపకాయలను తినేశాడు మరి.

దాంతో తక్కువ సమయంలో ఎక్కువ మిరపకాలను తిన్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు( World record ) సృష్టించాడు.అవును, కెనడాకు చెందిన మైక్ జాక్ అనే వ్యక్తి 6 నిమిషాల 49.2 సెకన్లలో మొత్తం 135 కరోలినా రీపర్స్ మిరపకాయలు తిని ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు.ఈ విషయాన్ని @GWR అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేయగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో మైక్ జాక్ తలపై ఎర్రటి హెయిర్ బ్యాండ్ ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకుని ముందు కరోలినా రీపర్స్ మిరపకాయలతో నిండిన ప్లేట్ పెట్టుకున్నాడు.

కాగా అమెరికాలో పండించే కరోలినా రీపర్స్(Carolina Reaper ) మిరప ప్రపంచంలోనే అత్యంత ఘాటుగా ఉండే మిర్చి అనే పేరు వుంది.నేరుగా ఒక్క మిరపకాయ తిన్నా నోటిలో ఎంత మంట వస్తుందో ఊహకు అందదు.అలాంటిది మనోడు ఒకదాని తర్వాత ఒకటి తింటూ మైక్ జాక్ మొత్తం 6 నిమిషాల 49.2 సెకన్లలో 135 కరోలినా రీపర్స్ మిరపకాయలు ఆరగించేశాడు.ఆ తరువాత తన అనుభవాన్ని చెబుతూ… తింటున్నప్పుడు కడుపంతా తిమ్మిరిగా మారిపోయిందని, పేగులను ఎవరో మెలిపెడితున్నట్టు అనిపిస్తోందని జాక్ పేర్కొన్నాడు.
మొత్తానికి ఆ మిరపకాయలను తిని ప్రపంచ రికార్డు అయితే కొట్టేశాడు.







