వైరల్: ఏకంగా పుంజుతో తలపడిన కోడి పిల్ల... ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని చాలా రేర్ గా మనల్ని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి జనాలను తెగ కితకితలు పెడుతొంది.

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడికి జస్టిఫికేషన్ లా మారింది.వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే.

సరిగ్గా నెల రోజుల వయసు కూడా లేని ఓ చిన్ని కోడి పిల్లకోడి పుంజు( Cock )తో ధైర్యంగా తలపడటం చూడవచ్చు.మనం కోడి పందాలు చూస్తూ ఉంటాం కదా.అదే తరహాలో ఆ కోడిపిల్ల( Chicken )కొండంత కోడిపుంజుతో ఢీకొడుతోంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దాని పోరాట పటిమను మెచ్చిన నెటిజన్లు ఆ కోడిపిల్లను తమదైన రీతిలో ప్రశాంసత్మక కామెంట్లతో ముంచెత్తుతున్నారు.ఫ్యూచర్ చాంపియన్ అని ఒకరంటే, గెలవడానికి ఎదుటివున్నవారు ఎంతటి బలవంతుడైనా సరే వెనక్కి తగ్గకూడదన్న విషయాన్ని దీనిని చూసి నేర్చుకోండి అని కొంతమంది ఇక్కడ కామెంట్స్ చేయడం గమనించవచ్చు.

Advertisement

కలర్ ఫుల్ అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన వీడియో ఇపుడు ఆహుతులను అలరిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.

కాగా దీనికి సంబంధించిన దృశ్యాలను మనం వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు.ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 71 వేల మంది లైక్ చేయడం విశేషం.వ్యూస్ విషయానికొస్తే కోటి వ్యూస్ కి దగ్గరలో వున్నాయి.

ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోని చూడలేదని, అలాంటి కోడి పిల్ల తమదగ్గర ఉంటే కళ్ళల్లో పెట్టి పెంచుకుంటామని పలువురు నెటిజన్లు ఈ వీడియోను( Viral video ) చూసి చెబుతున్నారు.కొంతమందైతే ఆ కోడిపిల్లతో ఏకంగా సినిమానే తీసేయొచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు