యూట్యూబర్‌ను ఉగ్రవాదిగా అనుకున్న ప్రజలు.. పోలీసులకు ఫోన్.. చివరకు.?

రోజురోజుకి యూట్యూబ్ వ్లాగర్ల( Youtube Vlogger ) సంఖ్య పెరుగుతోంది.చాలా మంది డబ్బు సంపాదించడానికి యూట్యూబ్‌ను మంచి వేదికగా ఉపయోగిస్తున్నారు.

ఎక్కడికెళ్లినా మొబైల్ ఫోన్ లేదా కెమెరా తీసుకుని వీడియో క్యాప్చర్ చేసి తమ యూట్యూబ్ లో షేర్ చేయడం కామన్ గా మారింది.అయితే, కొన్నిసార్లు వ్లాగర్ల ప్రవర్తన అడ్డంకికి దారితీస్తుందనడానికి తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఒక యువకుడు వ్లాగ్ చేయడానికి ఒక గ్రామానికి వచ్చినప్పుడు, అతని వెనుక బరువైన బ్యాగ్‌ని( Bag ) చూసి, గ్రామస్థులు అతన్ని ఉగ్రవాదిగా తప్పుగా భావించారు.వారు భయంతో పోలీసులకు కాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సూరజ్ శర్మ( Suraj Sharma ) అనే వ్లాగర్ ఒక గ్రామాన్ని సందర్శించాడు.

ఈ సందర్భంగా అతని వీపుపై బరువైన బ్యాగును చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.బ్యాగులో ఏముందో చూపించాలని గ్రామస్తులు పట్టుబట్టారు.అయితే, ఆ యువకుడు బ్యాగ్ తెరవడానికి నిరాకరించడంతో, అతన్ని ఉగ్రవాదిగా భావించి, భయంతో పోలీసులకు ఫోన్ చేశాడు.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

వైరల్‌గా మారిన వీడియోలో.గ్రామస్తులు, వ్లాగర్ వాగ్వాదం చేయడం చూడవచ్చు.బ్యాగ్‌ని విప్పి మీ అందరికీ చూపిస్తే.

వస్తువులన్నీ తిరిగి బ్యాగ్‌లో పెట్టేందుకు ఎక్కువ సమయం పడుతుందని.కావాలంటే మీరు పోలీసులకు ఫోన్ చేయవచ్చని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు.

అలాగే యువకుడు తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా చూపించాడు.ఇది నమ్మని గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

ఈ ఎగ్ మాస్క్ తో స్పాట్ లెస్ అండ్‌ వైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?
కరెంట్ తీగలపై కోతి పిల్ల డేంజరస్ స్టంట్స్‌.. తల్లి ఏం చేసిందంటే..

దింతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు