అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ నటుడు సుదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రాంత్ రోణ.పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 28వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
థియేటర్లో విడుదలైన తర్వాత ప్రతి ఒక్క సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా థియేటర్ రన్ పూర్తయిన ఆరు వారాల తర్వాత డిజిటల్ మీడియాలో ప్రసారమవుతుందని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీ విడుదల చేయడం కోసం ఈ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వగా దర్శకుడు మాత్రం ఈ సినిమా డిజిటల్ స్క్రీన్ పై చూసే సినిమా కాదని, ఈ సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాల్సిన సినిమా అంటూ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని త్రీడీలో ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు.

యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రమని, ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ కూడా అదేవిధంగానే చూపించారు.ఇక ఈ సినిమాని ఏకంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ గెస్ట్ రోల్ చేశారు.
ఇక ఈ సినిమాలో రకమ్మా అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగి పోతుంది.