సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలు ఎంతోమంది ఉన్నారు.ఆ హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్( Kollywood star hero Vikram ) ఒకరు.
ఈ హ్యాండ్సమ్ హీరో కెరీర్ ప్రారంభంలో తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.విభిన్నమైన కథలతో, అద్భుతమైన రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు విక్రమ్.
ఇక ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు .పేరుకు కోలీవుడ్ హీరో కానీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు.ఇంత అభిమానం సంపాదించుకున్న విక్రమ్ సినీ కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.కెరీర్ ప్రారంభంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు సినిమాలు పరాజయం చెందాయి.దీంతో విక్రమ్‌ను సినీ ప్రపంచం దురదృష్టవంతుడిగా ముద్ర వేసింది.కానీ 1999లో బాలా దర్శకత్వంలో వచ్చిన ‘సేతు’( Sethu ) సినిమాతో విక్రమ్ జీవితం మారిపోయింది.
వంద రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది.
విక్రమ్ సినీ ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్న సమయంలో ఆయన కజిన్, హీరో ప్రశాంత్ కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు.
అతను నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.సౌత్ లోని అన్ని భాషల్లో ప్రశాంత్ సినిమాలు విడుదల అయ్యేవి.
ఇక హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్, విక్రమ్‌కి సొంత మేనమామ అవుతాడు.అతనికి తమిళ ఇండస్ట్రీ లో నటుడిగా, డైరెక్టర్ గా , నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది.
కానీ త్యాగరాజన్ తన మేనళ్లుడు అయిన విక్రమ్‌కు ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.అలానే ప్రశాంత్ కూడా విక్రమ్ గురించి ఎక్కడా మాట్లాడకుండా అప్పట్లో దూరం పాటించాడు.
విక్రమ్ కూడా వారి గురించి ఎక్కడా మాట్లాడలేదు.విక్రమ్ నటించిన ఏడు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో అతనితో సినిమా చేస్తే నష్టపోతామని అందరూ అనుకున్నారు.
అలాంటి సమయంలోనే దర్శకుడు బాలాను విక్రమ్ కలిశాడు.విక్రమ్ హీరోగా ఆయన ‘సేతు’ సినిమాను తెరకెక్కించాడు.కానీ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ముందుకు రాలేదు.చివరకి ఏం చేయ్యాలో తెలియక ఆ చిత్ర నిర్మాతలు తక్కువ మొత్తానికే ఇచ్చేశారు.వారికి థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి.అయితే సినిమా పెద్ద హిట్ అయింది కానీ నిర్మాతలు మాత్రం పెద్దగా అంతగా లాభపడలేదు.
దీనికి విక్రమ్ కూడా కారణమని చెప్పారు.అతనికి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా వారి పేర్లు ఎక్కడా ఉపయోగించుకోకుండా ఉండటం అని పలువురు చెప్పుకొచ్చారు.
విక్రమ్ మామ కొడుకు అయిన ప్రశాంత్( Prashanth ) అప్పట్లో పెద్ద స్టార్.కానీ ప్రశాంత్ మాత్రం విక్రమ్ ఎవరో తనకు తెలియనట్లు ఉండేవాడు.సేతు సినిమాకు మరినన్ని థియేటర్లు కావాలని నిర్మాతలు మాట సాయం కోరినా ప్రశాంత్ స్పందించలేదట.దీంతో ఇరువురి కుటుంబాల మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని తర్వాత అందరూ భావించారు.
అందుకే విక్రమ్ కోసం త్యాగరాజన్, ప్రశాంత్ ఎలాంటి రికమెండేషన్ చేయలేదని పలువురు విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు.దీన్ని అవకాశంగా తీసుకొని విక్రమ్‌కి వచ్చిన సినిమా అవకాశాలను రానియ్యకుండా త్యాగరాజన్ ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అతను చేసిన పని వల్ల విక్రమ్ కి అవకాశాలు రాక చాలా కష్టపడాడు.చివరకి విక్రమ్ ఎంతో కష్టపడి తన లక్ష్యాన్ని చేరుకుని సూపర్ స్టార్ అయ్యాడు.
ఒకప్పుడు స్టార్ గా నిలిచిన హీరో ప్రశాంత్ అంటే మాత్రం ఇప్పుడు చాలామందికి తెలియదు.ఇప్పటికీ హీరో విక్రమ్ తన మేనమామ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు.
విక్రమ్ త్వరలోనే తంగళన్, ధ్రువనక్షత్రం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు పలకరించనున్నాడు.