విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ 'కోబ్రా' టీజర్ విడుదల

చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’.సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 Vikram, Ajay Gnanamuthu, Seven Screen Studios 'cobra' Teaser Released ,cobra,vik-TeluguStop.com

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.

శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా ‘కోబ్రా’ టీజర్ విడుదలైయింది.రెండు నిమిషాల నిడివిగల ఈ టీజర్ అధ్యంతం ఆకట్టుకుంది.

ప్రతి సమస్యను గణితంతో పరిష్కరించే మేధావి పాత్రలో బ్రిలియంట్ ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ తన ఫెర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేశారు.

అసాధ్యమైన కేసులని తన గణిత మేధతో పరిష్కరించే విక్రమ్ కు ఇర్ఫాన్ పఠాన్ పాత్ర రూపంలో సవాల్ ఎదురుకావడం, తర్వాత వచ్చిన హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ మునుపెన్నడూ చూడని థ్రిల్ ని ఇచ్చాయి.

ఇక టీజర్ చివర్లో విక్రమ్ ని తలకిందు లు గా వ్రేలాడదీసి ‘నువ్వేనా లెక్కల మాస్టర్ వి” అని తీవ్రంగా కొడుతుంటే.విక్రమ్ తనదైన శైలిలో నవ్వడం.

కోబ్రా కథపై మరింత క్యురియాసిటీని పెంచింది.

నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి.

హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ రిచ్ గా వుంది.యాక్షన్ ఎపిసోడ్స్ ని అద్భుతంగా చూపించారు.

ఏఆర్ రెహమాన్ టీజర్ కు అందించిన నేపధ్య సంగీతం అవుట్ స్టాండింగ్ గా వుంది.

ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడంతో పాటు మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చిత్రానికి భువన్ శ్రీనివాసన్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube