నారాయణ మరదలు వ్యవహారం .. విజయ సాయి సెటైర్లు

టిడిపి కీలక నేత మాజీ మంత్రి పొంగులేటి నారాయణ( Narayana ) వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

  నారాయణ మరదలు ఇటీవల ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు.

నారాయణ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని , మానసికంగా హింసిస్తున్నారు అంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది.ఈ వ్యవహారంపై వైసీపీ ఘాటుగా స్పందించింది.

అయితే ఈ వ్యవహారంలో టిడిపి సైలెంట్ గానే ఉంది.ఇక నారాయణ సోదరుడు ఈ వ్యవహారంపై స్పందించారు.

తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమె మాటలు ఎవరు పట్టించుకోవద్దని కోరుతూ మీడియా ద్వారా కోరారు.ఇక నారాయణ మరదలు కృష్ణప్రియ మాత్రం నారాయణ తనను లైంగికంగా వేధించారని,  29 ఏళ్లుగా తాను నరకం అనుభవిస్తున్నారని ఇంకా భరించే శక్తి తనకు లేదని ఆవేదన చెందుతూ మాజీ మంత్రి నారాయణ పై పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు.

Advertisement

 దీంతో నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం( Subrahmanyam ) ఆయన భార్య చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.అయితే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు.నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను ఖండించిన విజయసాయిరెడ్డి డిప్రెషన్ కి పిచ్చికి మధ్య తేడా ఉంటుందని,  కామ నారాయణ గారి తమ్ముడు తన వీడియోలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లు కొన్ని చూపిస్తూ వాటిపై డిప్రెషన్ అని స్పష్టంగా రాసి ఉంటే,  మ్యాడ్ నెస్ అని చెబుతున్నారని,  వీడియో చూస్తే అసలు మ్యాడ్ నెస్ అతనికి ఉన్నట్టు అర్థమవుతుందంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు పాపం మరదలు వరస అయ్యే మహిళను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తూ,  వావి వరుస లేకుండా లైంగికంగా వేధిస్తూ,  అంతులేని ఆవేదనకు గురి చేస్తున్నారు.

 రోజుకు 40 మాత్రలు మింగేలా ప్రోత్సహించి చివరకు క్యాన్సర్ బారిన పడినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆ మహిళపై అన్న సాధిస్తున్న ఆకృత్యాన్ని తమ్ముడు సమర్థిస్తున్నాడంటే పతనం ప్రారంభమైనట్లే అంటూ విజయసాయిరెడ్డి( Vijayasaieeddy )  విమర్శలు చేశారు.

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు