కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఏ సినిమా చేసిన అది భారీ బిజినెస్ జరుపు కుంటుంది.అంతేకాదు రిలీజ్ కు ముందు నుండే ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకుంటుంది.
తమిళ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ అందుకుని దూసుకు పోతున్న విజయ్ చేస్తున్న సినిమాలన్నీ కోట్లకు కోట్లు రాబడుతూ నిర్మాత జేబులను నింపుతున్నాయి.

కోలీవుడ్( Kollywood ) నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు మార్కెట్ ఉంది.అందుకే రిలీజ్ కు ముందే ఈయన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి.ఇదిలా ఉండగా ఈ బిజినెస్ కు తగ్గట్టుగానే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది.
పెద్దగా ప్రమోషన్స్ స్టార్ట్ కాకపోయినా లోకేష్ డైరెక్టర్ కావడం విజయ్ సినిమాపై ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఉండడం ఈ రేంజ్ లో ప్రీ సేల్స్ కు కారణం అని తెలుస్తుంది.మరి తాజాగా లియో సినిమా( Leo Movie ) యూఎస్ లో రికార్డ్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.
కనీసం ట్రైలర్ కూడా రాని సినిమాకు అప్పుడే యూఎస్ లో తెలుగు, తమిళ్ భాషలు కలిపి హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ రికార్డునే చెబుతుంది ఈ సినిమాపై ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హోప్స్ పెట్టుకున్నారో.ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా( Dasara Release ) కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
చూడాలి ఓపెనింగ్స్ తోనే ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో.







