తెలుగు విశ్వసుందరిగా విజయవాడ అమ్మాయి

విజయవాడకు చెందిన ఓ యువతికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది.

డిగ్రీ చదువుతూ మోడల్ గా రాణించాలనే లక్ష్యంతో అంత మందితో ఫోటీ పడి మరి అరుదైన గౌరవాన్ని సంపాదించుకుంది.

తెలుగు కల్చలర్ ఫెస్ట్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన బి.నాగదుర్గా కుసుమసాయి డిగ్రీ చదువుతోంది.చదువుతో పాటు నాట్యం, నాటక రంగాల్లో శిక్షణ పొందుతుంది.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇతర తెలుగు సంస్థలు కలిసి ఆన్ లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్-2020 పోటీలు నిర్వహిస్తున్నారు.విషయం తెలిసి మోడల్ గా రాణించాలని అనుకుంటున్న నాగదుర్గ ఆ పోటీలో పాల్గొంది.

పోటీల్లో 600 మంది యువతులు పాల్గొన్నారు.అన్ని రౌండ్లు పూర్తి చేసుకుని చివరకు నాగదుర్గ కుసుమసాయి విజేతగా నిలిచింది.

Advertisement

దీంతో ఆమెను తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నిర్వహించిన ఆన్ లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్-2020 పోటీలో గెలిచి తెలుగు విశ్వసుందరిగా కిరీటాన్ని దక్కించుకుంది.పోటీలో 600 మంది పోటీపడి మొదటి స్థానంలో నిలిచి గెలవడంతో చాలా సంతోషంగా ఉందని, తెలుగు విశ్వసుందరిగా అరుదైన గౌరవం లభించడం చాలా ఆనందంగా ఉందని కుసుమసాయి పేర్కొన్నారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు