అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన తెలుగు యువకుడిని మృత్యువు కబళించింది.
మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరానికి చెందిన నెక్కలపు హరీశ్ చౌదరిగా గుర్తించారు.ఇతను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.విజయవాడ శివార్లలోని పోరంకికి చెందిన నెక్కలపు హరీశ్ చౌదరి ఎంటెక్ పూర్తి చేసి పదేళ్ల క్రితం కెనడాకు వెళ్లాడు.
అక్కడ టూల్ మేకర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.హరీశ్‌కు నాలుగేళ్ల క్రితం సాయి సౌమ్యతో వివాహం జరిగింది.
ఈ నేపథ్యంలో బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ఇతాకా వాటర్‌ఫాల్స్‌లో విహారయాత్రకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో ఫోటో దిగే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలుజారి జలపాతంలో పడిపోయాడు.
ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో అతను కొట్టుకుపోయాడు.దీంతో రెస్క్యూ సిబ్బంది కొద్దిగంటల పాటు గాలించి హరీశ్ మృతదేహాన్ని వెలికితీశారు.
అనంతరం అతని భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.హరీశ్ మరణవార్త తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అటు పోరంకిలోనూ బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.హరీశ్ మృతదేహాన్ని భారతదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇకపోతే.కొద్దినెలల క్రితం అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోనూ ఓ భారతీయ విద్యార్ధి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించాడు.కేరళకు చెందిన క్లింటెన్ అజిత్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.ఈ క్రమంలో ఏప్రిల్ 26న తరగతులు ముగిసిన తర్వాత స్నేహితులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్నాడు అజిత్.
అయితే ఈ సమయంలో బాల్ .అక్కడికి దగ్గరలో వున్న చెరువులో పడింది.దానిని తీసుకొచ్చేందుకు అజిత్ చెరువులో దిగాడు.ఈ సమయంలో ఒక్కసారిగా కాలు జారీ నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు.దీనిని గమనించిన అతని మిత్రులు చెరువు దగ్గరకు వెళ్లి సాయం కోసం అరిచారు.కానీ అప్పటికే ఆలస్యం కావడంతో అజిత్ నీటిలో గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు.దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి విద్యార్ధి మృతదేహాన్ని బయటకు తీశారు.