విజయ్ సేతుపతి( Vijay sethupathi ) అంటే సినిమా ఇండస్ట్రీ లో ఒక గొప్ప నటుడు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు.ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ కి ఏదో ఒక రకమైన కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
ఇక ఫర్జి’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన విజయ్ సేతుపతి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక దాంతో ఆయన నటించిన ముంబైకర్ మూవీ జూన్ 2 న నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది.
ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…ముందు గా కథ విషయానికి వస్తె ఒక గ్యాంగ్ స్టర్ అయిన విజయ్ సేతుపతి ఒక పిల్లాడ్ని కిడ్నాప్ చేస్తాడు.వేరే పిల్లాడికి బదులు అతడు ఈ పిల్లాడ్ని కిడ్నాప్ చేస్తాడు.
అయితే ఆ పిల్లాడు ముంబైలో ఓ డాన్ కొడుకే కావడం ఇక్కడ ట్విస్ట్.సినిమా మొత్తం దీని చుట్టే తిరుగుతుంది.
ఓ మాఫియా డాన్ కొడుకు కిడ్నాప్‌కు గురైతే.ఊహించని రీతిలో సామాన్యుల జీవితాలు ఎలా అల్లకల్లోలం అవుతాయి.
కిడ్నాపర్లు, పిల్లవాడికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అన్నవి సినిమా చూసి తెలుసుకోవాలి.

ఈ చిత్రం కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు( Lokesh Kanagara ) గతంలో తెరకెక్కించిన ‘మానగరం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ‘మానగరం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకుంది.తెలుగులో కూడా ‘నగరం’ అనే పేరుతో ఈ సినిమా డబ్ అయింది.ఇక ఇదే సినిమాని చిన్న చిన్న మార్పులతో ‘ముంబై కర్( Mumbaikar )’ అనే పేరుతో హిందీలో తెరకెక్కించారు…

ఈ మూవీ లో ముంబైని పూర్తిస్థాయిలో చూపించే ప్రయత్నం చేసారు.అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కాస్త గజిబిజిగా ఉంది.ఈ సినిమాలోని పాత్రలు ఆసక్తికరం గా ఉన్నాయి కానీ.కథ అంత బలంగా లేదు.కొన్ని ఉప కథలను క్లైమాక్స్ లో కలిపే ప్రయత్నం చేసారు.కామెడీ బాగా వర్కౌట్ అయింది.
ఇందులో విజయ్ సేతుపతి హిందీ మాట్లాడే తీరు నవ్వు తెప్పిస్తుంది.రణవీర్ షోరే.విక్రాంత్ మాస్సే, తాన్య మానిక్త, సంజయ్ మిశ్రా పరిధి మేరకు నటించారు…

అయితే ఈ చిత్రంలోని నటుల వల్ల అంచనాలు బాగా పెరిగిపోయాయి.కానీ ఈ సినిమా ఆ అంచనాలు అందుకోలేదు.కొన్ని చోట్ల మెరుపులు కనిపిస్తాయి.దర్శకుడిగా సంతోష్ శివన్( Santosh Sivan ) కొంతవరకు విజయం సాధించారు.కెమెరా యాంగిల్స్ లో కొంచెం స్పష్టత లోపించింది.సంగీతం ఓకే గా ఉంది ఇక ఈ సినిమా కి ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అది విజయ్ సేతుపతి నటన అనే చెప్పాలి ఇక దానితో పాటు కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి క్లైమాక్స్ కూడా చాలా వరకు ఇంప్రెస్ చేసింది…ఇక ఈ సినిమా కి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా స్టోరీ బలం గా లేకపోవడం,ఇక స్క్రీన్ ప్లే కూడా అంత బాగాలేదు అనే చెప్పాలి…
.