అందుకే సినిమానుంచి తప్పుకున్నా.. క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.!

ఈ మధ్య కాలంలో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ విజయ్ సేతుపతి నటుడిగా తన స్థాయిని పెంచుకుంటున్నారు.

విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తే ఆ సినిమా రేంజ్ కూడా మారిపోతూ ఉండటంతో డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కు డిమాండ్ పెరుగుతూ ఉండటంతో దర్శకనిర్మాతలు సైతం విజయ్ సేతుపతిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే గత రెండు రోజుల నుంచి విజయ్ సేతుపతిని బాలీవుడ్ సినిమా నుంచి తప్పించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.విజయ్ సేతుపతి బాలీవుడ్ మూవీ నుంచి తప్పుకోవడంతో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించి విజయ్ సేతుపతి వివరణ ఇచ్చుకున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో మొదట ఒక పాత్ర కోసం ఎంపికైన విజయ్ సేతుపతి ఎంపికయ్యారు.

అయితే విజయ్ సేతుపతి ఈ సినిమాలో పాత్ర కొరకు బరువు తగ్గాల్సి ఉండగా బరువు తగ్గలేదని ప్రచారం జరిగింది.

Advertisement

బరువు తగ్గకపోవడంతో లాల్ సింగ్ చద్దా మూవీ మేకర్స్ విజయ్ సేతుపతిని లాల్ సింగ్ చద్దా సినిమా నుంచి తప్పించారని ప్రచారం జరగగా ఆ సినిమా నుంచి తనను తప్పించినట్టు వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని విజయ్ సేతుపతి అన్నారు.ఆ సినిమాకు తాను డేట్లు కేటాయించలేక పోవడం వల్లే సినిమా నుంచి తప్పుకున్నానని అంతకు మించి ఆ సినిమా నుండి తప్పుకోవడానికి మరే కారణం లేదని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చి తన గురించి తప్పుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాడనే చెప్పాలి.

మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతికి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని విజయ్ సేతుపతి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు