ఓరమ్యాక్స్ సంస్థ ప్రతి నెలా విడుదల చేసే సర్వే ఫలితాల గురించి ఫ్యాన్స్ మధ్య చర్చ జరగడంతో పాటు ఈ ఫలితాల గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు అయితే ఉంటాయి.అయితే ఓరమ్యాక్స్ సంస్థ తాజాగా ఆల్ ఇండియా పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ కు సంబంధించిన వివరాలను ప్రకటించింది.2022 డిసెంబర్ నెలకు సంబంధించిన ఈ సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు.
టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలకు ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ విజయ్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవడం కొంతమందికి షాకిస్తోంది.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా విజయ్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే తొలి స్థానం మిస్ అయినా తర్వాత స్థానాలలో టాలీవుడ్ స్టార్ హీరోలు నిలిచారు.
టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలలో ఒకరైన ప్రభాస్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి.ఆర్.ఆర్.ఆర్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న తారక్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నాలుగో స్థానంలో ఉండగా బన్నీ ఐదో స్థానంలో నిలిచారు.
కన్నడ స్టార్ హీరో యశ్ ఆరో స్థానంలో నిలవగా అజిత్ ఏడో స్థానంలో నిలవడం గమనార్హం.షారుఖ్ ఖాన్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలవగా రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో మహేష్ బాబు పదో స్థానంలో నిలిచారు.ఈ హీరోలు తమ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.