రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు.అందులో ఒకటి పరశురాం డైరెక్షన్ లో సినిమా కాగా.
మరొకటి గౌతం తిన్ననూరి( Gautam Tinnanuri ) డైరెక్షన్ లో సినిమా ఉంది.అయితే గౌతం తిన్ననూరితో విజయ్ చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో వస్తుంది.
ఈ సినిమా విషయంలో రౌడీ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.అయితే ఈ సినిమా గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది.
సినిమాలో విజయ్ తో పాటుగా మరో హీరో కూడా ఉంటాడట.అయితే అతను బాలీవుడ్( Bollywood ) హీరోని తీసుకునే అవకాశాలు ఉన్నట్టు టాక్.అతనెవరు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.త్వరలో ఆ విషయం తెలుస్తుంది.విజయ్ ఈ సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చేస్తారని టాక్.సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే విజయ్ గౌతం కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్తుందట.
ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టార్గెట్ తో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.