లైగర్ సినిమా తో ప్లాప్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,ఆ తరువాత డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .గీత గోవిందం ,అర్జున్ రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ దేవరకొండ, ఆ తరువాత రూట్ మార్చి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో కలిసి పాన్ ఇండియా మూవీగా లైగర్ సినిమాలో నటించాడు ఇక ఈ మూవీ కోసం హీరో విజయ చాలా కష్టపడినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం దక్కలేదు .
లైగర్ సినిమా తరువాత హీరో విజయ్ తను చేయబోయే తరువాత ప్రాజెక్ట్స్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
కధలు విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
విజయ్ కు యూత్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఆ ఇమేజ్ నుండి బయటకు వచ్చి చేసిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.యంగ్ టాలెంటెడ్ హీరోస్ అడవి శేష్ , విశ్వక్ సేన్ ,నిఖిల్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు ,మరి ఈ రేస్ లో రౌడీ హీరో చాలా వెనుకపడిపోయాడు.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరిస్థితి చూస్తే ఒక్క ఛాన్స్ ఒక్క సాలిడ్ హిట్ పడితే చాలు మల్లి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవ్వచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు.న్యాచురల్ స్టార్ నాని తో నిన్ను కోరి లాంటి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతుంది అని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ.

అలానే ఇక నాని తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఒక పవర్ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసాడు .ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ మూవీ చేస్తున్నసంగతి తెలిసందే .మెగా పవర్ రామ్ చరణ్ ఫోకస్ అంతా శంకర్ సినిమా మీదనే ఉంది .ఇక డైరెక్టర్ గౌతమ్ కూడా రామ్ చరణ్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేసి రామ్ చరణ్ కు వినిపించాడు ,

అలానే ఈ స్టోరీ కి కూడా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు , ఇక ఆ తర్వాత ఏమైందో కానీ ,సడెన్ గా కొన్ని అనివార్య కారణాలు వల్ల ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండకు వద్దకు వచ్చింది .ఇక గౌతమ్ తిన్ననూరి – రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు సంబందించిన సినిమా అఫీషియల్ ఎనౌన్సుమెంట్ చేస్తూ మూవీ యూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది .ఇక 2023 లో రౌడీ హీరో విజయ దేవరకొండ వీరిద్దరి డైరెక్టర్స్ తో పక్కాగా సాలిడ్ హిట్ అందుకుంటాను ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు , న్యాచురల్ స్టార్ హీరో నాని కి హిట్స్ ఇచ్చిన ఇద్దరు టాప్ డైరెక్టర్స్ రేస్ లో కాస్త వెనుక పడ్డారు ,మరి వీరిద్దరు కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు సాలిడ్ హిట్ ఇచ్చి వీరు కూడా మల్లి ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.







