రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పించనున్న "స్లమ్ డాగ్ హజ్బెండ్", హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది.

 Vijay Deverakonda Launches Slum Dog Husband Motion Poster Details, Vijay Deverak-TeluguStop.com

ఇది మంచి కంటెంట్ ఉన్న ఓ చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం.ఇక మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం చేస్తున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు.

గతంలోనే అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ కు మంచి స్పందన వచ్చింది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదలైన ఫ్రస్ట్రేషన్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ పై సాగే ఈ పాటలో స్టార్ యాక్టర్ సునీల్ స్పెషల్ అప్పీయరెన్స్ చేయడం విశేషం.

కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇంతకు ముందు ఓ పిట్టకథ చిత్రంతో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ రావుకు ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇస్తుంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.

Telugu Reliance, Sanjay Rao, Slum Dog, Slum Dog Poster-Movie

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :

ఎడిటర్ – వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి , సంగీతం – భీమ్స్ సిసిరోలియో , సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి , పీఆర్వో – జీఎస్కే మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి , బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ , సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల , ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం , నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube